For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs AUS: ఇంగ్లండ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు!

ఇంగ్లండ్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి ఆస్ట్రేలియా‌తో జరగనున్న అయిదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టును హ్యారీ బ్రూక్ నడిపించనున్నాడు. 2018 అండర్-19 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్సీ వహించిన బ్రూక్ తొలిసారి సీనియర్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. అయితే ఇటీవల కాలంలో ఈ ఇంగ్లిష్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక అవ్వడం ఇది మూడోసారి.

శ్రీలంకతో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టును ఒలీ పోప్ నడిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ సారథిగా ఫిల్ సాల్ట్ ఉన్నాడు. తాజాగా వన్డే ఫార్మాట్‌కు హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో టీ20 కెప్టెన్సీ పగ్గాలను బ్రూక్ అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం బట్లర్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

ENG vs AUS Harry Brook Set to Lead England in Australia ODI Series

25 ఏళ్ల బ్రూక్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 18 టెస్టులు, 15 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 53.72 సగటుతో 1558 పరుగులు, వన్డేల్లో 29.07 సగటుతో 407 పరుగులు, టీ20‌ల్లో 30.74 ఏవరేజ్‌తో 707 పరుగులు చేశాడు. కాగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు యువ పేసర్ జోస్ హల్ గాయం కారణంగా దూరమయ్యాడు.

ఆస్ట్రేయాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇంగ్లండ్:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఒల్లీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్

మూడో టీ20 వర్షార్పణం
కాగా, మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక మూడో టీ20 వర్షం కారణంగా రద్దయింది. దీంతో సిరీస్‌ను 1-1తో ఇరు జట్లు పంచుకున్నారు. తొలి టీ20లో ఆసీస్ 28 పరుగుల తేడాతో, రెండో టీ20లో ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లివింగ్‌స్టోన్‌ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Story first published: Monday, September 16, 2024, 7:37 [IST]
Other articles published on Sep 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+