Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ చారిత్రక విజయం

లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 186 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. వర్షం కారణంగా 39 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-2తో సమం చేసింది. అయిదు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (87; 58 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్) తన ఫామ్ కొనసాగిస్తూ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ డకెట్(63; 62 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. లివింగ్ స్టోన్ (62 నాటౌట్; 27 బంతుల్లో, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.

ENG vs AUS Brook Livingstone Shine as England s Seamers Dismantle Australia in 186-Run Victory

మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్‌లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీతో విజృంభించి 28 పరుగులు సాధించాడు. ఆసీస్ బౌలర్లలో జంపా రెండు, మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు. అనంతరం 313 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ట్రావిస్ హెడ్ (34; 23 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మాథ్యూ పాట్స్ నాలుగు వికెట్లు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశారు.

అయితే ఆసీస్‌కు శుభారంభమే దక్కింది. హెడ్, మిచెల్ మార్ష్ (28; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత 58 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ పది వికెట్లు కోల్పోయింది. నలుగురు ఆసీస్ బ్యాటర్లే రెండంకెల స్కోరు అందుకున్నారు. వన్డేల్లో ఆస్ట్రేలియాకు పరుగుల పరంగా ఇది నాలుగో అతి పెద్ద ఓటమి. ఇంగ్లండ్ చేతిలో రెండో అతిపెద్ద ఓటమి. ఈ జాబితాలో 2018లో ఇంగ్లండ్ చేతిలో 242 పరుగుల ఓటమి టాప్‌లో ఉంది.

ENG vs AUS Brook Livingstone Shine as England s Seamers Dismantle Australia in 186-Run Victory

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో ఓటమి. ఈ మైదానంలో నమోదైన రెండో అత్యల్ప స్కోరు (126) కూడా ఇదే. 2003లో దక్షిణాఫ్రికా చేసిన 107 స్కోరు అత్యంత అత్యల్పం. ఇక తొలి వికెట్‌కు 50+ భాగస్వామ్యం నమోదై ఆస్ట్రేలియా చేసిన అత్యల్ప స్కోరు‌ ఇదే. అంతకుముందు ఈ పేలవ రికార్డు 1985‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 139 స్కోరుగా ఉండేది. ఇక పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది అతి పెద్ద రెండో విజయం. 1975లో భారత్‌పై 202 పరుగుల విజయం అత్యుత్తమం.

Story first published: Saturday, September 28, 2024, 7:58 [IST]
Other articles published on Sep 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+