For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Eng and Nz 3rd Test: జట్టులోకి కేన్ మామ ఎంట్రీ.. టాస్ గెలిచి బ్యాటింగ్.. ఇద్దరికీ క్యాప్‌లు

Eng and Nz 3rd Test: Newzealand Won the Toss and Elected Bat First

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఇంగ్లాండ్ సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య నేడు లీడ్స్‌లోని హెడ్డింగ్లీలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. చివరిదైన టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయాన్ని సాధించి.. సిరీస్ వైట్ వాష్ చేయాలని ఇంగ్లాండ్ చూస్తుండగా.. ఒక్క టెస్ట్ అయినా గెలిచి గౌరవం కాపాడుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. ఇకపోతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఇంగ్లాండ్ టీమ్ ప్రస్తుతం అత్యుత్తమ రీతిలో ఆడుతుంది.

కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతుంది. ఇక న్యూజిలాండ్ బానే ఆడుతున్నా.. రెండో ఇన్నింగ్స్‌‌లలో ఆ జట్టు కాస్త పట్టువిడుస్తోంది. ఫలితంగా ఇంగ్లాండ్ గెలుపొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక మూడో టెస్ట్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కరోనా వల్ల రెండో టెస్ట్‌కు దూరమైన కేన్ మామ తిరిగి పగ్గాలు అందుకున్నాడు.

ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. ఇంగ్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జేమీ ఓవర్టన్ తన తొలి టెస్ట్ క్యాప్‌ని అతని సోదరుడు క్రెయిగ్ నుంచి అందుకున్నాడు. ఇక 25వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జాక్ లీచ్ తన 25వ టెస్ట్ మ్యాచ్ క్యాప్‌ను.. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక రెండు టెస్ట్‌లలో రాణించిన అండర్సన్‌కు మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ టీం విశ్రాంతినిచ్చింది.

తుది జట్లు
న్యూజిలాండ్ ( ప్లేయింగ్ XI ) : టామ్ లాథమ్, విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ ( కెప్టెన్ ) , హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ ( వికెట్ కీపర్ ) , మైకేల్ బ్రేస్‌ వెల్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్
ఇంగ్లండ్ ( ప్లేయింగ్ XI ) : అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ ( వికెట్ కీపర్ ), జామీ ఓవర్‌టన్, మ్యాటీ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్

Story first published: Thursday, June 23, 2022, 16:03 [IST]
Other articles published on Jun 23, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+