పట్టు బిగించిన బంగ్లాదేశ్.. కివీస్‌కు షాక్ తప్పేలా లేదుగా!

న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై పర్యాటక జట్టు బంగ్లాదేశ్ పట్టుబిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోర్: 147-5. క్రీజులో టేలర్ (37), రచీన్ రవీంద్ర (6) ఉన్నారు. బంగ్లాపై కివీస్ 17 పరుగుల అధిక్యంలో మాత్రమే ఉంది. అంతకు ముందు విల్ యంగ్ 69 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో కెప్టెన్ లాథమ్ 14, కాన్వే 13 పరుగులు చేశారు. హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్ డకౌట్ అయ్యారు.
కివీస్‌ను దెబ్బకొట్టిన ఎబాడోత్ హుస్సేన్
130 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్ బౌలర్ ఎబాడోత్ హుస్సేన్ దెబ్బకొట్టాడు. జట్టు స్కోర్ 63 పరుగుల వద్ద ఉండగా.. 13 పరుగులు చేసిన కాన్వేను ఫెమిలియన్ పంపాడు. స్కోర్ 136 పరుగుల వద్ద ఉండగా.. 69 పరుగులతో రాణిస్తున్న విల్‌యంగ్‌ను ఔట్ చేశాడు. దీంతో యంగ్, టేలర్ 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మళ్లీ చెలరేగిన ఎబాడోత్ హుస్సేన్.. వెంటనే హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్‌ను డకౌట్లు చేశాడు. హుస్సేన్ దెబ్బకు 136 పరుగుల స్కోర్ వద్దే కివీస్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రవీంద్రతో కలిసి టేలర్ మరో వికెట్ పడకుండ జాగ్రత్త పడ్డాడు.

తొలి సెషన్‌లోనే బంగ్లా ఆలౌట్
అంతకుముందు 401-6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను మొదలు పెట్టిన బంగ్లాదేశ్ మరో 57 పరుగులు జోడించి
458 పరుగులకు ఆలౌటైంది. 445 పరుగుల వద్ద 47 పరుగులు చేసిన హాసన్‌ను సౌధీ ఔట్ చేయడంతో ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆలౌటవడానికి ఎంతో సమయం పట్టలేదు. యాసర్ అలీ, టాస్కిన్ అహ్మద్, ఇస్లాం వెంట వెంటనే ఔట్ అయిపోయారు. కివీస్ బౌలర్లలో బోల్డ్ 4, వాగ్నర్ 3, సౌధీ 2, జేమిన్సన్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 328 పరుగులకు ఆలౌటైంది.

గెలుపుపై బంగ్లా దృష్టి
ఇక చివరిదైనా ఐదో రోజు ఆటలో బంగ్లాదేశ్ గెలుపుపే దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసి విజయవంతంగా లక్ష్యాన్ని చేధిస్తే బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం అందుకోవడం ఖాయం. అయితే కివీస్ సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్‌ను ఔట్ చేయడంపైనే ఆధారపడి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications