Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2024: అభిషేక్‌కు చోటు, కెప్టెన్‌గా తిలక్ వర్మ.. భారత జట్టు ప్రకటన

ఒమన్ వేదికగా అక్టోబర్ 18 నుంచి ఎమర్జింగ్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగాటోర్నీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మ సారథ్యంలో 15 మందితో కూడిన భారత్-ఏ జట్టును వెల్లడించింది. ఐపీఎల్ స్టార్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, సీనియర్ ప్లేయర్ రాహుల్ చాహర్ ఎంపికయ్యారు.

ఐపీఎల్‌లో మెరిసిన యువ ఆటగాళ్లకు జట్టులో ప్రధానంగా చోటు దక్కింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) ఎంపికయ్యారు. బౌలర్లుగా ఆర్ సాయి కిశోర్ (గుజరాత్ టైటాన్స్), హృతిక్ షోకీన్, రసీక్ సలామ్ (ఢిల్లీ క్యాపిటల్స్), వైభవ్ అరోరా (కేకేఆర్), అకీబ్ ఖాన్ స్థానం దక్కించుకున్నారు. 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత, ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం దక్కింది.

Emerging Asia Cup T20 2024 Tilak Varma Named Captain of India A Squad

ఎమర్జింగ్ ఆసియా కప్ వివరాలు
ఆయా దేశాలకు సంబంధించిన 'ఏ' జట్లు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాల్గొంటాయి. మొత్తం 8 దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కసారి తలపడనుంది. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.

ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ఎంపికైన భారత్-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

Story first published: Sunday, October 13, 2024, 20:27 [IST]
Other articles published on Oct 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+