Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2024: కెప్టెన్‌గా తిలక్.. భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? పూర్తి షెడ్యూల్ ఇదే!

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో నాలుగు రోజుల్లో ఎమర్జింగ్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి ఒమన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో ఆయా దేశాల 'ఏ-జట్లు' పాల్గొననున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సారథ్యంలో 15 మందితో కూడిన భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఈ మెగాటోర్నీలో మొత్తం 8 దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కసారి తలపడనుంది. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.

Emerging Asia Cup T20 2024 Full Squads Schedule Venues and Dates

భారత్ పూర్తి షెడ్యూల్:
అక్టోబర్ 19: భారత్-ఏ వర్సెస్ పాకిస్థాన్-ఏ
అక్టోబర్ 21: భారత్-ఏ వర్సెస్ యూఏఈ-ఏ
అక్టోబర్ 23: భారత్-ఏ వర్సెస్ ఒమన్
అక్టోబర్ 25: సెమీఫైనల్-1
అక్టోబర్ 25: సెమీఫైనల్-2
అక్టోబర్ 27: ఫైనల్

ఎమర్జింగ్ ఆసియా కప్‌కు ఎంపికైన భారత్-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

Story first published: Monday, October 14, 2024, 13:03 [IST]
Other articles published on Oct 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+