Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Emerging Asia Cup: ఇదేం ఫీల్డింగ్ రా.. పాకిస్థాన్‌కు తగ్గట్లుగానే వారసులు!(Video)

పాకిస్థాన్ & ఆ జట్టు ఫీల్డింగ్.. ఈ రెండింటి అనుబంధానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఫీల్డింగ్‌లో మెరుగవ్వాలని తాతల తరాల నుంచి పోరాడుతున్నా ఇప్పటికీ పాక్ జట్టులో ఎలాంటి మార్పు లభించలేదు. అదే చెత్త ఫీల్డింగ్! క్యాచ్ కోసం ఇద్దరు ప్లేయర్లు దగ్గరగా వచ్చి ఎవరూ అందుకోకపోవడం, సింగిల్‌ను డబుల్స్‌గా, డబుల్స్‌ను బౌండరీగా మార్చడం ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే భవిష్యత్‌లో అయినా పాకిస్థాన్ ఫీల్డింగ్ మెరుగవుతుందనుకుంటే, అది జరిగేలా కనిపించట్లేదు. పాకిస్థాన్ సీనియర్లకు తగ్గట్లుగా వారసులు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌లో పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ దారుణంగా ఉంది. చెత్త ఫీల్డింగ్ తమ బ్లడ్‌లోనే ఉందని, అది తమ జన్మహక్కు అన్నట్లుగా పాక్ యువ ఆటగాళ్లు మైదానంలో ప్రవర్తించారు.

Emerging Asia Cup Pakistan s Youth Team Mirrors Senior Side with Poor Fielding Performance Watch

గ్రూప్ దశలో పాకిస్థాన్ వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. సింగిల్‌ను కట్టడి చేయానికి ఓ పాక్ ఫీల్డర్ బాగా ప్రయత్నించాడు. అంతేగాక నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్ చేయడానికి త్రో కూడా విసిరాడు. అయితే స్టంప్స్‌కు గురి కుదరలేదు. దాన్ని అతి కష్టంగా మరో ఫీల్డర్ ఆపాడు. అక్కడితో అది ముగిసిందా అంటే అదీ లేదు.

దాన్ని అందుకున్న ఫీల్డర్ మరోసారి నాన్‌స్ట్రైకర్ వైపు త్రో విసిరాడు. దాన్ని ఆపడానికి ఓ ఫీల్డర్ ప్రయత్నించాడు. అది అతనికి చిక్కలేదు. ఆ తర్వాత మరో ఫీల్డర్ ట్రై చేశాడు. అప్పటికే బంతి దొరకలేదు. ఇక ఆ ఇద్దరు మిస్ చేసిన అనంతరం బౌండరీ లైన్‌లో మరో ఫీల్డర్ బంతిని అందుకున్నాడు. మొత్తంగా సింగిల్‌ను ఆపాలనుకున్న పాక్ మిషన్ అతి కష్టంగా సక్సెస్ అయ్యింది. అయితే ఇదంతా జరుగుతుంటే యూఏఈ బ్యాటర్లు మాత్రం సింగిల్‌కు మరోసారి ప్రయత్నించకుండా పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను ఎంజాయ్ చేయడం విశేషం.

కాగా, ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సెమీస్‌కు చేరిన పాక్ శ్రీలంక చేతిలో ఓటమిపాలై నిష్క్రమించింది. ఫైనల్‌లో శ్రీలంకను అఫ్గానిస్థాన్ ఓడించి ఎమర్జింగ్ ఆసియా కప్‌ను గెలుచుకుంది. మరో సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 28, 2024, 19:26 [IST]
Other articles published on Oct 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+