Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భవిష్యత్తులో మనం చూడబోయే గొప్ప మహిళా క్రికెటర్ ఆమె!

 Ellyse Perry the greatest female player were ever going to see, says Edwards

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీపై ఇంగ్లాండ్ మాజీ మహిళా కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించింది. మనం చూడబోయే గొప్ప మహిళా క్రీడాకారిణి ఎల్లీస్ పెర్రీ అంటూ కొనియాడింది. ఇటీవలే జరిగిన మహిళల యాషెస్‌ను ఆసీస్ గెలుచుకోవడంలో పెర్రీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజ్డన్‌తో ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ "నేను ఆమెకు వ్యతిరేకంగా ఆడటాన్ని ఎంతగానో అస్వాదించాను. అంతేకాదు నేను ఆడటం మానేసినప్పటి నుండి పెర్రీ తన ప్రదర్శనను మరింతగా మెరుగుపరచుకుంది. మీకు తెలుసా? ఆమె ఓ అద్భుతమైన బ్యాటర్" అని తెలిపారు.

నేను ఆడిన సమయంలో ఆమె బౌలర్

నేను ఆడిన సమయంలో ఆమె బౌలర్

"నేను క్రికెట్ ఆడిన సమయంలో తానొక బౌలర్. ఇప్పుడు పెర్రీ ఓ ఆల్ రౌండర్‌గా చక్కటి ప్రదర్శన చేస్తోంది. మనం చూడబోయే గొప్ప మహిళా క్రీడాకారిణి. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. నిజంగా ఆమె గ్రేట్. ప్రస్తుతం ఆమె వయసు 28. వయసుతో పాటు రాణిస్తోంది" అని ఎడ్వర్డ్స్ తెలిపారు.

టెస్టుల్లో పెర్రీ యావరేజి 78

ఇంగ్లాండ్‌తో ఇటీవలే ముగిసిన మూడు ఫార్మాట్లలో పెర్రీ 94.5 యావరేజితో 378 పరుగులు చేసింది. 15 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది. కాగా, వన్డేల్లో పెర్రీ బ్యాటింగ్ యావరేజి 50గా నమోదు కాగా, టీ20ల్లో 30, టెస్టుల్లో 78గా ఉంది. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డుని సృష్టించింది.

టీ20ల్లో తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత

టీ20ల్లో తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత

అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లతో పాటు వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ ఇంతవరకు ఈ ఘనతను ఏ క్రికెటరూ సాధించ పోవడం విశేషం. గత ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో పెర్రీ ఈ ఘనతను సాధించింది.

Story first published: Thursday, August 1, 2019, 18:51 [IST]
Other articles published on Aug 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+