Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ee Sala Cup Namde Trolls: పాపం ఆ ఆంటీకి జన్మలో పెళ్లి కాదేమో.. ఆర్సీబీ ఓటమితో ఆంటీ మీద నెటిజన్ల సెటైర్లు..!

Ee Sala Cup Namde: Netizens Satires On Girl For Placard Showing On Not Getting Married Until RCB Wins IPL

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌‌ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగిన సంగతి తెలిసిందే. జోస్ బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) దండయాత్ర వల్ల ఆర్సీబీ చిత్తు కాగా.. రాజస్థాన్ 7వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్లో ఒక్కసారైనా టైటిల్ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలనుకున్న ఆర్సీబీ ఆశలు గల్లంతు కావడంతో నెట్టింటా ట్రోలర్స్ మరోసారి రెచ్చిపోయారు.

ఐపీఎల్లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు అయిన ఆర్సీబీ ప్రతిఏడాది చెప్పే మాట.. ఈ సాల కప్ నమ్ దే.. ఇదే ట్యాగ్ లైన్‌కు ట్యాగ్ జోడించి ట్రోల్స్, మీమ్స్‌తో ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఇక కొందరు విరాట్ కోహ్లీ, చోక్లీ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ ట్యాగ్ లైన్స్ భలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే ఈ ట్రోల్స్ అన్నింటిలో ఓ ఆంటీ ఆర్సీబీ గెలిచేదాకా నేను పెళ్లి చేసుకోను అంటూ ప్లకార్డు ప్రదర్శించిన పోస్టు తెగ వైరలైంది. ఇక ఈ పోస్టు మీద నెటిజన్లు మరిన్ని మీమ్స్ చేయడమే కాకుండా.. కామెంట్లతో హోరెత్తించారు.

ఆర్సీబీ ప్లేయర్లు ఆంటీకి న్యాయం చేయాలి

ఇక ఆర్సీబీకి డై హార్డ్ ఫ్యాన్ అయిన ఆ ఆంటీ.. ఆర్సీబీ టైటిల్ గెలిచేదాకా తాను పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చున్నట్లు ప్లకార్డు ప్రదర్శించగా.. దీన్ని చాలా మంది రిట్వీట్ చేస్తూ తమతమ కామెంట్లను జోడిస్తూ ఈ పోస్టును తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక ఈసారి కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలవలేకపోవడంతో పాపం ఆ ఆంటీకి మరో ఏడాది పెళ్లయ్యే భాగ్యం మిస్సయిందని కొందరు నార్మల్ గా కామెంట్ చేయగా.. ఇక కొందరైతే తప్పకుండా ఆర్సీబీ ప్లేయర్లు దీన్నో సవాల్ గా తీసుకుని ఆ ఆంటీకి న్యాయం చేయాలని, లేకపోతే ఆమె ఎప్పటికీ పెళ్లి కాని ఆంటీలా మిగిలిపోతుందని బాధపడుతున్నట్లు పోస్టులు పెట్టారు.

ఆ ఆంటీ సింగిల్‌గా ఉండాలని ఫిక్సయిందేమో

ఇక కొందరైతే ఆ ఆంటీ కావాలనే ఆ పోస్టు పెట్టిందని పేర్కొంటున్నారు. ఎలాగూ ఆర్సీబీ గెలిచేది లేదు.. ఆ ఆంటీకి పెళ్లయ్యేది లేదు. ఆర్సీబీ ఎలాగూ గెలవదు కాబట్టే.. ఆ ఆంటీ ఆ ప్లకార్డ్ పెట్టిందంటున్నారు. ఆమె సింగిల్ గా ఉండాలని ఫిక్సయింది కాబట్టే ఆ ప్లకార్డు ప్రదర్శించిందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఆ ఆంటీ ఏజ్ బార్ అయిపోయింది. ఇంకేం పెళ్లవుతుందని భావించి.. ఇక ఆర్సీబీ ఫ్యాన్‌లా అయినా పబ్బం గడుపుకుంటూ తనకు పెళ్లి కాకపోవడానికి ఆర్సీబీ గెలవకపోవడమే రీజన్ అన్నట్లు ఈ ప్లకార్డు ప్రదర్శించిందని కొందరు పేర్కొంటున్నారు.

ఆర్సీబీ గెలిచేసరికి ఆ ఆంటీ.. ముసలవ్వ అవుతుంది

ఇకపోతే ఇంకొందరు మాత్రం ఆర్సీబీ గెలిచేనాటికి ఆ ఆంటీ కాస్త పండు ముసలవ్వ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ మేరకు పలు మీమ్స్ కూడా చేశారు. ఇంకొందరు అయితే జన్మలో ఆ ఆంటీకి పెళ్లయ్యే భాగ్యం లేదంటూ పక్కాగా చెప్పేశారు. మరికొందరు అయితే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌లాగా ఆర్సీబీ ఫ్యాన్లలో ఆ ఆంటీ ఎప్పటికీ సింగిల్ గా నిలిచిపోతుందంటూ పేర్కొన్నారు. ఏదేమైనా ఆర్సీబీ కప్ గెలవకపోవడమేమోగానీ.. ఆర్సీబీ ఫ్యాన్లకు మాత్రం నెటిజన్ల వింత వింత ట్రోల్స్, మీమ్స్ ద్వారా మనస్సు చివుక్కుమంటోంది.

Story first published: Saturday, May 28, 2022, 14:37 [IST]
Other articles published on May 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+