Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'శ్రేయస్ అయ్యర్‌ అంటే పిచ్చి..పెళ్లి చేసుకోవాలని ఉంది'

Shreyas Iyer: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. కానీ ఐపీఎల్ ఫైనల్‌‌లో ఆర్సీబీ జట్టుపై పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. కానీ శ్రేయస్ అయ్యర్ ఎంతో మంది ప్రేమను సంపాదించుకున్నాడు. ఓ నటి కూడా భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పిచ్చి ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది., పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో ప్రేమలో పడిన నటి పేరు ఎడిన్ రోజ్. ఎడిన్ రోజ్ బి‌గ్‌బాస్ 18 పోటీదారు కూడా గమనార్హం.

హిందీ బిగ్‌బాస్ 18లో వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ఇచ్చిన ఎడిన్ రోజ్ భారత్ క్రికెటకర్ శ్రేయస్ అయ్యర్‌ను వివాహం చేసుకోవడం గురించి మాట్లాడింది. ఎడిన్ రోజ్ బాలీవుడ్ సినిమాలో కనిపించకపోయినా, ఈవెంట్లలో, పబ్లిక్‌లో కనిపించడం కొనసాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎడిన్ రోజ్ మాట్లాడుతూ.. కాను శ్రేయస్ అయ్యర్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పింది. శ్రేయస్ అయ్యర్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. తన మనస్సులో శ్రేయస్ అయ్యర్‌ను భర్తగా భావించనని ఎడిన్ రోజ్ చెప్పింది.

Edin Rose Expresses Love for Shreyas Iyer Says She Wants to Marry Him

ఎడిన్ రోజ్ శ్రేయస్ అయ్యర్ పట్ల ఎంత పిచ్చిగా ఉందంటే.. ఆమె తనను తాను శ్రేయస్ అయ్యర్ ఇద్దరు పిల్లలకు తల్లిగా భావించింది. ఎడిన్ రోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన అభిమానుల కోసం ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎడిన్ రోజ్‌కు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎడిన్ రోజ్ ప్రకటనకు సంబంధించి క్రికెటర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ ఎడిన్ రోజ్ శ్రేయస్ అయ్యర్‌ను చాలా ప్రేమిస్తోందని స్పష్టమైంది.

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ భాగంగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను జట్టు రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయస్ అయ్యర్‌కు జట్టు కెప్టెన్సీ కూడా ఇచ్చింది. శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత జట్టును ఐపీఎల్ ఫైనల్స్‌కు నడిపించాడు. కెప్టెన్సీతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్‌ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఈ సమయంలో అయ్యర్ స్ట్రైక్ రేట్ దాదాపు 176 ఉంది. శ్రేయస్ ఈ సీజన్లో 6 హాఫ్ సెంచరీలు చేశాడు.

Story first published: Friday, June 6, 2025, 20:35 [IST]
Other articles published on Jun 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+