Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే.. కరన్ ఔట్.. కెప్టెన్‌గా స్టోక్స్‌!!

ECB name squad for first Test against West Indies, Sam Curran out

సౌతాంప్టన్‌: కరోనా వైరస్ వ్యాప్తితో నాలుగు నెలలకు పైగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొన్ని ఆటలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇక క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంగ్లండ్-వెస్టిండీస్‌ ‌టెస్ట్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్‌లో తొలి టెస్టు జరుగనుంది. అయితే తొలి టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ నేషనల్‌ క్రికెట్‌ సెలక్టర్లు శనివారం ప్రకటించారు. మరో 9 మందిని రిజర్వ్‌ ఆటగాళ్ల కింద ఎంపిక చేశారు.

జో డెన్లీ, డోమ్ బెస్‌లకు ఇంగ్లండ్ సెలక్టర్లు అవకాశం ఇవ్వడంతో డాన్ లారెన్స్‌కు నిరాశే ఎదురైంది. స్టార్ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయినా కూడా కూడా అతడికి చోటు దక్కలేదు. ఆర్చర్, బ్రాడ్, ఆండర్సన్, వోక్స్, వుడ్‌లు బౌలింగ్ విభాగంలో ఎంపికయ్యారు. ఇక ఇంగ్లండ్ పురుషుల టెస్టు జట్టు 81వ కెప్టెన్‌గా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్‌ అవతరించనున్నాడు. భార్య ప్రసవం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ తొలి టెస్టుకు దూరమవుతున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. చీలమండ శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న స్టార్ పేసర్‌ షానన్‌ గాబ్రియేల్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రిజర్వ్‌ ఆటగాడిగా ఇంగ్లండ్‌కు వచ్చిన గాబ్రియేల్.. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి అవకాశం ఇచ్చింది.

క్రికెటర్లకు ఒకరినుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా లేదా అసలు వైరస్‌ ఉనికే లేకుండా ఉంచేందుకు బయో సెక్యూర్‌ వాతావరణం సృష్టిస్తున్నారు. దీంతో మ్యాచులు జరిగే ప్రాంతంలో వైరస్‌ ఉండదని ఈసీబీ భావిస్తోంది. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈసీబీ కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించింది. మూడు వేదికల్లో జరగాల్సిన సిరీస్‌ను రెండింటికే పరిమితం చేసింది. స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. అక్కడి ఇతరులు రాకుండా నిబంధనలు జారీ చేశారు. క్రికెటర్లు సైతం బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. పర్యాటక వెస్టిండీస్‌ జట్టు, మ్యాచ్‌ అధికారులు, బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సిబ్బంది సైతం ఈసీబీ నిబంధనలు పాటించి మూడు వారాలు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు:
బెన్ స్టోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, జో డెన్లీ, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

విండీస్‌ టెస్టు జట్టు:
జేసన్‌ హోల్డర్ ‌(కెప్టెన్‌), బ్లాక్‌వుడ్‌, బానర్‌, బ్రాత్ ‌వైట్‌, బ్రూక్స్‌, క్యాంప్‌బెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, కార్న్‌ వాల్‌, డౌరిచ్‌, గాబ్రియేల్‌, చెమర్‌ హోల్డర్‌, షై హోప్‌, అల్జారీ జోసెఫ్‌, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌.

Story first published: Saturday, July 4, 2020, 18:35 [IST]
Other articles published on Jul 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+