ఇంగ్లండ్ క్రికెటర్లు సురక్షితం.. 702 మందికి కరోనా నెగెటివ్!!

లండన్: క్రీడలపై కూడా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బాగానే పడుతోంది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఈ ప్రమాదకర వైరస్ బారినపడ్డారు. పాకిస్తాన్‌లో పది మంది, బంగ్లాలో ముగ్గురు క్రికెటర్లు వైరస్ బారిన పడగా.. స్టార్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్, గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించింది. ఇందులో ఎవరికీ వైరస్ సోకలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

702 మందికి కరోనా నెగెటివ్:
వెస్టిండీస్‌తో సిరీస్ కోసం జట్టులో స్థానం కోసం పోటీపడుతోన్న ఇంగ్లండ్ క్రికెటర్లకు ఈ నెల 3 నుంచి 23 వరకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 702 పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ వైరస్ సోకలేదని ఈసీబీ నిర్ధారించింది. '702 పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. ఆటగాళ్లు, మ్యాచ్ ప్రతినిధులతో పాటు సహాయక, ఈసీబీ, స్టేడియాల, హోటల్ సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహించారు. ఏజియస్ బౌల్, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని బయో సెక్యూర్ వేదికల్లో సురక్షిత వాతావరణం ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ పరీక్షలు జరిపారు' అని ఈసీబీ తెలిపింది.

ఆర్చర్‌కు రెండోసారి కరోనా పరీక్షలు:
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు రెండోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. గురువారం అతను జాతీయ జట్టు శిక్షణ శిబిరంలో చేరబోతున్న నేపథ్యంలో అతణ్ని మళ్లీ పరీక్షించనున్నారు. 'ఇదివరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆర్చర్, అతని కుటుంబ సభ్యులకు వైరస్ సోకలేదని తేలింది. మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తర్వాత జట్టుతో కలిసేందుకు అనుమతిస్తాం' అని ఈసీబీ పేర్కొంది.

ఇదేమీ హాలీడే క్యాంప్ కాదు:
దాదాపు మూడు నెలల విరామం తర్వాత ట్రైనింగ్ కోసం ఏసెస్ బౌల్స్‌కు చేరిన ఇంగ్లండ్ టీమ్‌ను ఈసీబీ డైరెక్టర్ ఆష్లే జైల్స్ గట్టిగా హెచ్చరించాడు. ఇదేమీ హాలీడే క్యాంప్ కాదన్నాడు. కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో కొవిడ్-19 ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలన్నాడు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆగేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారని ఆయన తెలిపాడు. ఇంగ్లండ్-వెస్టిండ్ మధ్య రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్‌లో జూలై 8న తొలి టెస్టు ప్రారంభం కానుంది. బయో సెక్యూర్ వాతావరణంలో టెస్టులను ఈసీబీ నిర్వహిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదింది ఎవరో తెలుసా?