న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఇంగ్లండ్ బోర్డు!!

ECB announces dates and venues for England Test series against West Indies

లండన్: వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు మూడు నెలల పాటు క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని అన్ని దేశాలు సడలించడంతో.. తర్వలోనే ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడనున్నారు. క్రికెట్‌లో అందరికంటే ముందుగా ఇంగ్లండ్ ఆటగాళ్లు మైదానంలోకి దిగనున్నారు.

కరోనా‌తో మరో పాకిస్థాన్ క్రికెటర్ మృతి!!కరోనా‌తో మరో పాకిస్థాన్ క్రికెటర్ మృతి!!

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. హాంఫ్‌షైర్ బౌల్ వేదికగా తొలి టెస్ట్ జూలై 8వ తేదీన ప్రారంభం కానుంది. అనంతరం ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగానే.. రెండు, మూడో టెస్ట్‌లు 16వ తేదీన, 24వ తేదీన జరుగనున్నాయి. అయితే ఈ తేదీల్లో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణకు యూకే ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.

జూన్‌లో జరగాల్సిన వెస్టిండీస్-ఇంగ్లండ్ సిరీస్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గత వారం అంగీకరించింది. వెస్టిండీస్ క్రికెటర్లు జూన్ 9వ తేదీన ఓల్డ్ ట్రాఫర్డ్‌కు చేరుకొని అక్కడ మూడు వారాల క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత సౌతాంప్టన్ వెళ్లి ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. ఈ వేసవిలో ఇంగ్లండ్ పురుషులు మరియు మహిళల ఇతర షెడ్యూల్‌లపై కూడా తర్వలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈసీబీ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తి మాట్లాడుతూ... 'అందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రభుత్వంతో, వైద్య సిబ్బందితో తరచూ చర్చిస్తున్నాం. ఇవి కేవలం ప్రతిపాదించిన తేదీలు మాత్రమే. వీటికి యూకే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈ పర్యటన విజయవంతం అయ్యేందుకు సహకరిస్తున్న క్రికెట్ వెస్టిండీస్‌కు మా ధన్యవాదాలు. వచ్చే వారాల్లో మళ్లీ క్రికెట్‌ని చూడాలని ఆశపడుతున్నాం' అని అన్నారు.

Dates and Venues:

#1st Test v West Indies: 8-12 July at Ageas Bowl

# 2nd Test v West Indies: 16-20 July at Emirates Old Trafford

# 3rd Test v West Indies: 24-28 July at Emirates Old Trafford

Story first published: Tuesday, June 2, 2020, 20:27 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X