For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు షాక్.. మరోసారి గాయంతో దూరమైన దీపక్ చాహర్.. అతని స్థానంలో ఎవరంటే?

EBig Blow to Teamindia as Deepak Chahar Ruled Out of ODI Series with Back Stiffness Issue

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టుకు ఎంపికైన భారత స్టార్ బౌలర్ దీపక్ చాహర్ మరోసారి గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బ్యాక్ స్టిఫ్ నెస్ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ రిప్లేస్ చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. ఇండియాకు రెండో వన్డే చాలా కీలకమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా సిరీస్ నిలుపుకోగలుగుతుంది. ఇక ఈ వన్డేకు ముందు వాషింగ్టన్ సుందర్‌ జట్టులో చేరాడు.

అసలెలా గాయమైందంటే..

అసలెలా గాయమైందంటే..

దీపక్ చాహర్ అక్టోబర్ 6న జరిగిన సిరీస్ ప్రారంభ వన్డేలో ఆడలేదు. ఇక శనివారం అతని గాయం తీవ్రతపై ఓ అంచనాకు వచ్చిన మెడికల్ టీం అతనికి ప్రాపర్ ట్రీట్ మెంట్ అవసరమని భావించింది. దీంతో సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దీపక్ చాహర్ దూరమయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో దీపక్ చాహర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మూడో టీ20 టైంలో బ్యాటింగ్‌తోను కాసేపు మంచి ఇన్నింగ్స్ ఆడి అలరించాడు. బ్యాటింగ్ అనంతరం చాహర్‌కు వెన్నులో స్టిఫ్ నెస్ సమస్య ఉత్పన్నమైంది. అయితే అది తాత్కాలికమైనదేనని పేర్కొన్నప్పటికీ.. తొలి వన్డే మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఇక ఇప్పుడు సమస్య జటిలమని తేలడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

 ప్రపంచకప్ రిజర్వ్ ప్లేయర్‌గా కూడా మిస్సయే ఛాన్స్

ప్రపంచకప్ రిజర్వ్ ప్లేయర్‌గా కూడా మిస్సయే ఛాన్స్

ఇక దీపక్ చాహర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి రిహబిలేషన్ కోసం వెళ్లనున్నాడు. అక్కడ వైద్య బృందం దీపక్ ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. అక్కడ కోలుకుంటే అతను రిజర్వ్ ప్లేయర్‌గా టీ20 ప్రపంచకప్ కోసం ఆసీస్ వెళ్లే అవకాశముంది. లేకపోతే అతను టీ20 ప్రపంచకప్ కోసం రిజర్వ్ ప్లేయర్ లిస్టు నుంచి కూడా మిస్సవుతాడు. ఇకపోతే భారత్ మిగిలిన రెండు వన్డేలను రాంచీ, ఢిల్లీ వేదికల్లో ఆడనుంది. అక్టోబర్ 9న ఆదివారం రాంచీలో మ్యాచ్ జరగనుండగా.. 11న ఢిల్లీ వేదికగా మ్యాచ్ జరగనుంది. గాయాల కారణంగా అంతర్జాతీయ సెటప్‌కు చాలా కాలంగా దూరంగా ఉన్న వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే ప్రధాన టీ20 ప్రపంచ‌కప్ జట్టులో భాగమైన ప్లేయర్లు తమ శిక్షణ, సన్నాహాలను ముందుగానే ప్రారంభించడానికి ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. దీంతో భారత వన్డే జట్టును శిఖర్ ధావన్ నడిపిస్తున్నాడు. ధావన్ భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత వన్డే జట్టులో ప్రపంచ కప్ జట్టులోని స్టాండ్‌బై ఆటగాళ్లు అయిన శ్రేయస్ అయ్యార్, రవిబిష్ణోయ్ కూడా ఉన్నారు.

తొలి వన్డే విషయానికొస్తే..

తొలి వన్డే విషయానికొస్తే..

ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ గెలిచి 1-0తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. భారత్ తొలి గేమ్‌లో కేవలం తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. వాతావరణ పరిస్థితుల కారణంగా 40ఓవర్లకు తొలి వన్డే మ్యాచ్ కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 249పరుగుల స్కోరు చేసింది. 250పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ విఫలమైనా.. శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ హాఫ్ సెంచరీలతో గొప్ప పోరాటాన్ని కొనసాగించారు. అయితే చివరి ఓవర్లో 9పరుగుల తేడాతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

Story first published: Saturday, October 8, 2022, 16:14 [IST]
Other articles published on Oct 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+