Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సెంచరీ వీరుడు జాదవ్ పవర్‌కు కారణం చికెన్ తినడమే'

హైదరాబాద్: 65 బంతుల్లో సెంచరీ చేసి రాత్రికి రాత్రే టీమిండియాలో కేదార్ జాదవ్ హీరో అయ్యాడు. స్వతహాగా వెజిటేరియన్ కుటుంబానికి చెందిన కేదార్ జాదవ్ అత్యంత వేగంగా సెంచరీ సాధించడానికి కారణం చికెన్ తినడమేనని జాతీయ సెలక్టర్ సురేంద్ర బావే చెప్పాడు.

మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి మహదేవ్ జాదవ్ కుమారుడు కేదార్ జాదవ్. వీరి కుటుంబంలోని సభ్యులంతా పూర్తిగా వెజిటేరియన్లు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో జాదవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సురేంద్ర బావే వెల్లడించాడు.

జాదవ్ చికెన్ తినే క్రెడిట్ తనకే ఇవ్వాలని, అతడు చికెన్ తినాలని ప్రోత్సహించింది తానేనని బావే చెప్పాడు. జాదవ్‌కు కోచ్‌గా, అన్నగా, మెంటార్‌గా, గైడ్‌గా తాను వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. పూణెలో జరిగిన తొలి వన్డేలో కేదార్ జాదవ్ 65 బంతుల్లో సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఐదో బ్యాట్స్ మెన్‌గా గుర్తింపు పొందాడు.

Eating chicken, the secret behind Kedar Jadhav's power

మొట్టమొదటి సారి బెహార్ ట్రోఫీలో యువ కేదార్ జాదవ్‌ని చూశానని అప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ ట్రోఫీలో భాగంగా కేరళలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ 262 బంతుల్లో 195 పరుగులు చేశాడు.

'జాదవ్‌ని చూడగానే స్పెషన్ అనిపించింది. కేరళ బౌలర్లను అలవోకగా అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం. అతడి బాడీ లాంగ్వేజి ఎంతో సహాజంగా ఉంటుంది' అని చెప్పాడు. అన్ని ఫార్మెట్లకు జాదవ్ సరిగ్గా సరిపోతాడని ఆనాడే తాను భావించినట్లు బావే పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కేదార్ జాదవ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు వికెట్ కీపింగ్ చేశాడు. అతడి ఆటతీరుని బట్టి చూస్తే మల్టీ టాలెండ్ అని తెలుస్తోందని అన్నాడు. ముంబై తరుపున అంతక ముందు రెండు రంజీ సీజన్లలో వాంఖడె స్టేడియంలో అద్భుతమైన సెంచరీని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+