న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరంగేట్రంలోనే అదరగొట్టిన 'గౌతమ్ గంభీర్'

Gautam Gambhir Wins In His Election Debut ! || Oneindia Telugu
East Delhi Elections Results: Ex Indian Cricketer Gautam Gambhir wins in his electoral debut

టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాజకీయ అరంగేట్ర ఎన్నికల్లోనే అదరగొట్టాడు. లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంభీర్.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

భారీ విజయం:

భారీ విజయం:

గంభీర్‌ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లు గౌతికి పడ్డాయి. అర్విందర్ సింగ్‌కు 3,04,718 ఓట్లు వచ్చాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిశీ మెర్లీన్ 2,19,156 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. గంభీర్‌ భారీ విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్‌గా నిరూపించుకున్న గంభీర్‌.. పార్లమెంటేరియన్‌గా కూడా విజయవంతం అవ్వాలని సన్నిహితులు, అభిమానులు ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన గంభీర్‌కు మాజీ సహచరులు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, రైనా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఎంపికను విఫలం కానివ్వం:

విజయం సాధించిన అనంతరం గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 'ఇది లవ్లీ కవర్‌ డ్రైవో లేదా ఆతిశీపై అద్భుత బ్యాటింగో కాదు. ఇది ప్రజలు ఆమోదించిన భాజపా గంభీర భావజాలం. భాజపా జాతీయ పార్టీకి, భాజపా డిల్లీకి, అద్భుత తీర్పునిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల ఎంపికను విఫలం కానివ్వం' ప్రత్యర్థుల పేర్లతో పాటు తన పేరు కూడా వచ్చేలా ట్వీట్ చేశాడు.

గంభీర్ సవాల్:

గంభీర్ సవాల్:

గంభీర్ గత ఏడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాడు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా గంభీర్‌ను బరిలోకి దించింది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో గంభీర్, ఆప్ అభ్యర్థి అతిశి మర్లేనా మధ్య మాటల యుద్ధం జరిగింది. గంభీర్ తన గురించి అభ్యంతరకర పదజాలంతో ముద్రించిన కొన్ని లక్షల కరపత్రాలను పంచారని అతిశి మీడియా ముందు తెలిపారు. అయితే ఆ కరపత్రాలను పంచానని నిరూపిస్తే వెంటనే పోటీ నుంచి తప్పుకుంటానని, అవాస్తమైతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని గంభీర్ సవాల్ విసిరారు. చివరకు గంభీర్ భారీ విజయం సాధించాడు.

Story first published: Friday, May 24, 2019, 9:14 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X