Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌ అవసరం ఏముంది?: 'కోహ్లీ ఎందుకిలా చేస్తున్నావ్!'

హైదరాబాద్: తన రాజీనామాకు కెప్టెన్ కోహ్లీనే కారణమని అనిల్ కుంబ్లే ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. కుంబ్లేని బీసీసీఐ అవమానకరంగా సాగనంపడంపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మదన్ లాల్ లాంటి మండిపడ్డారు.

తాజాగా కోహ్లీ వ్యవహార శైలిపై టీమిండియా మాజీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. భారత క్రికెట్‌కు అతనికి అతడే 'బాస్' అనుకొంటే జట్టుకు కోచ్‌ అవసరం లేదని అన్నాడు. కోహ్లీ-కుంబ్లే మధ్య విభేదాలపై ఆయన కాస్తంత ఘాటుగానే స్పందించారు.

కెప్టెన్ బాస్‌ అయినప్పుడు కోచ్‌ అవసరం ఏముంది?

కెప్టెన్ బాస్‌ అయినప్పుడు కోచ్‌ అవసరం ఏముంది?

‘కెప్టెన్ బాస్‌ అయినప్పుడు వారికి అసలు కోచ్‌ అవసరం ఏముంది? వారికి బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల (సంజయ్‌ బంగర్‌, శ్రీధర్‌) సేవలు సైతం అవసరం లేదని నాకు అనిపిస్తోంది' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఉన్న అర్హతలేంటని ఆయన ప్రశ్నించారు.

కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు

కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు

'కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మంచి కెప్టెన్ అవునో కాదో తెలియదు. అనిల్‌ కుంబ్లే లాంటి క్రికెట్ లెజెండ్‌నే గౌరవించకపోతే బంగర్‌, శ్రీధర్‌కు మాత్రం అది దక్కుతుందని ఎలా అనుకోగలం. కోహ్లీతో మాట్లాడగల కనీస ధైర్యం, ఆత్మవిశ్వాసం వారికుందా? వారికి కుంబ్లే అంత అనుభవం కూడా లేదు' అని ప్రసన్న నిలదీశారు.

ఫిజికల్‌ ట్రైనింగ్‌కు ఒకరిని తీసుకొంటే చాలు

ఫిజికల్‌ ట్రైనింగ్‌కు ఒకరిని తీసుకొంటే చాలు

కెప్టెన్‌గా కోహ్లీది అదే ఆలోచన అయితే జట్టుకు కోచ్ అవసరం లేదని ప్రసన్న తేల్చి చెప్పారు. ఫిజికల్‌ ట్రైనింగ్‌కు ఒకరిని తీసుకొంటే సరిపోతుందని చెప్పారు. కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాడి పట్ల కోహ్లీ ప్రవర్తన తనను బాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. కోచ్‌గా, కెప్టెన్‌గా కోహ్లీ పూర్తి బాధ్యతలు తీసుకొంటే గతంలో మాదిరి లాజిస్టిక్స్‌ను చూసుకొనేందుకు ఓ మేనేజర్‌ను నియమించుకొంటే సరిపోతుందని అన్నారు.

ధోని, యువరాజ్ ఎంపికపై కూడా

ధోని, యువరాజ్ ఎంపికపై కూడా

మరోవైపు కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను ఎంపిక చేసే గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ మరింత సమగ్రంగా ఉండాలని సూచించాడు. ఇక, 2019 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకొని ధోని, యువరాజ్ ఎంపిక గురించి ఆలోచించాలని ప్రసన్న సెలక్టర్లకు సూచించారు. వచ్చే వరల్డ్ కప్ నాటికి వారిద్దరి వయసు 38 ఏళ్లు ఉంటుందని, కాబట్టి యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తే బాగుటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+