31 బంతుల్లో సెంచరీ: అరుదైన రికార్డుని తృటిలో మిస్సైన స్మిత్
హైదరాబాద్: హాంకాంగ్ ట్వంటీ20 బ్లిట్జ్ టోర్నీలో వెస్టిండిస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ అరుదైన రికార్డుని నమోదు చేశాడు. ఇటీవల ప్రారంభమైన ఈ టోర్నీలో డ్వేన్ స్మిత్ 31 బంతుల్లో సెంచరీని సాధించాడు. తద్వారా ఈ ఫార్మాట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
టోర్నీలో భాగంగా బుధవారం సీటీ కైతక్‌తో జరిగిన మ్యాచ్లో కావ్ లూన్ కాంటాన్స్ తరుపున ఆడుతున్న స్మిత్ 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి అర్ధసెంచరీని 16 బంతుల్లో పూర్తి చేసిన స్మిత్ రెండో అర్ధసెంచరీ కోసం 15 బంతులు మాత్రమే తీసుకున్నాడు.

తొలి ఓవర్లోనే స్మిత్ 28 పరుగులు
సెంచరీ సాధించే క్రమంలో డ్వేవ్ స్మిత్ 11 సిక్సర్లు, 6 ఫోర్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే స్మిత్ 28 పరుగులు రాబట్టడం విశేషం. మొత్తంగా 40 బంతులను ఎదుర్కొన్న స్మిత్ 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. 12వ ఓవర్‌లోనే స్మిత్ సెంచరీ సాధించడం విశేషం.

అరుదైన రికార్డుని తృటిలో చేజార్చుకున్న స్మిత్
డ్వేవ్ స్మిత్ సెంచరీతో 200 పరుగుల లక్ష్యాన్ని కావ్ లూన్ కాంటాన్స్ జట్టు అలవోకగా అందుకుంది. 14.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. మరోవైపు స్మిత్ ఓ అరుదైన రికార్డుని తృటిలో చేజార్చుకున్నాడు.

టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ
టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు వెస్టిండిస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో జరిగిన ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడైన క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ రికార్డుని సృష్టించాడు.

హాంకాంగ్ ట్వంటీ20 బ్లిట్జ్ టోర్నీలో హేమా హేమీలు
ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వెస్టిండిస్‌కు చెందిన డ్వేన్ స్మిత్ ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీని చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక సెంచరీ చేసిన స్మిత్ ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే ఐదు రోజుల పాటు జరిగే హాంకాంగ్ ట్వంటీ20 బ్లిట్జ్ టోర్నీలో వెస్టిండిస్ ఆటగాళ్లు స్మిత్, శామ్యూల్స్, డారెన్ సామీలతో పాటు ఇంంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ బెల్‌లు ఆడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications