Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని హెలికాప్టర్ షాట్‌‌ను గుర్తుపట్టాడు: క్రికెట్ గురించి 'ది రాక్' చెప్పిన ముచ్చట్లు

Dwayne Johnson tries to understand cricket: Watch how The Rock performed

హైదరాబాద్: రెజ్లర్ నుంచి హాలీవుడ్ హీరోగా మారిన 45 ఏళ్ల డ్వేన్ జాన్ నటించిన 'జుమాంజి: వెల్‌కమ్‌ టు ది జంగిల్‌' సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా డ్వేన్ జాన్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నాడు.

ఈ సినిమాని భారతీయులకు దగ్గర చేసేందుకు గాను డ్వేన్ జాన్ క్రికెట్‌ను ప్రచారాస్త్రంగా ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అతడు క్రికెట్‌లో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు, ఆటగాళ్ల షాట్లను గుర్తుపట్టాల్సి ఉంది.

Dwayne Johnson tries to understand cricket: Watch how The Rock performed

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హాలీవుడ్‌కు చెందిన డ్వేన్ జాన్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్‌ షాట్‌ను గుర్తు పట్టడం. ఈ వీడియోలో ఆటగాళ్ల షాట్లను కరెక్టుగా గుర్తుపట్టిన డ్వేన్ జాన్ అంఫైర్ల సిగ్నల్స్‌ను మాత్రం గుర్తుపట్టలేకపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించే దానిని చూపించి ఆ సిగ్నల్‌ ఎందుకు అని ప్రశ్నించగా 'నువ్వు నంబర్‌ వన్‌' అని చెప్పేందుకు అని బదులిచ్చాడు.

ఆ తర్వాత 'థర్డ్‌ అంపైర్‌' సిగ్నల్‌ గురించి అడగ్గా 'అందంతో ఆ ఒక్క బాక్సులో ఫిట్‌ అవ్వలేవు' అని డ్వేన్ జాన్ చెప్పుకొచ్చాడు. 'నో బాల్‌' చూపించి అడగ్గా 'హే రాక్‌, భారత్‌లో ఉన్న నీ అభిమానులంతా ఈ పక్కనే ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు.

అనంతరం క్రికెటర్ల షాట్‌లను చూపించగా వాటికి సరిగ్గా సమాధానలిచ్చాడు. ధోని ఆడిన ఓ షాట్‌ను చూపించి అదేం షాట్‌ అని ఆడగ్గా వెంటనే 'హెలికాప్టర్‌ షాట్‌' అని చెప్పాడు. శ్రీలంక మాజీ ఓపెనర్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఆడిన షాట్‌ను 'ర్యాంప్‌ షాట్‌' అని చెప్పాడు.

క్రికెట్ గురించి 'ది రాక్' సినిమా హీరో ఏం చెప్పాండో మీరూ ఓ లుక్కేయండి...

Story first published: Tuesday, December 26, 2017, 12:56 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+