Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేమ్ అర్థం చేసుకోవటంలో ధోనీ దిట్ట, ఐపీఎల్‌లో డేన్ బ్రావో

Dwayne Bravo talks about CSK and MS Dhoni ahead of IPL 2018 auction

హైదరాబాద్: ఐపీఎల్ సంబారాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అందరి కంటే ముందే మొదలైయ్యాయి. జనవరి 27, 28 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏ జట్టులో ఎవరు కొత్తగా వస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. జనవరి 4న ఆటగాళ్ల రిటెన్షన్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌కు తెర లేచింది.

వేలంలో వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావోను దక్కించుకోవాలని చూస్తోంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. రెండేళ్ల నిషేధం విధించకముందు బ్రావో ఐదేళ్లపాటు ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బ్రావో బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా బ్రావో మాట్లాడుతూ..'చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడిన ఐదేళ్లు చాలా ఎంజాయ్‌ చేశాను. ధోనీ నాయకత్వంలో ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఐపీఎల్‌ ఆడటం ద్వారా నా ఆటలో చాలా మార్పులు చేసుకున్నాను.

ధోనీ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో దిట్ట. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ గేమ్‌ను ధోనీ సులువుగా అంచనా వేస్తాడు. నేను ఆడుతోన్న జట్టులో అలాంటి ఆటగాడు ఉండటం చాలా ఆనందంగా ఉంది. డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ వేయడం నాకు ఇష్టం. జట్టు విజయం కోసం మరింత బాధ్యత, సవాళ్లను స్వీకరించడంలో ఉండే మజానే వేరు. ధోనీ నాపై నమ్మకంతో డెత్‌ ఓవర్లను నాతోనే వేయిస్తాడు. అతని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆడటమే నా లక్ష్యం' అని బ్రావో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, January 23, 2018, 9:24 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+