Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీపై బ్రావో సరికొత్త పాట.. ఇది శాంపిల్ మాత్రమే!!

Dwayne Bravo shares glimpse of new song on MS Dhoni

ఆంటిగ్వా: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయం గడుపుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసం సరికొత్త పాటను కంపోజ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించి కొంత పాటను వినిపించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్​ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. అతడి సోదరుడి కోసం చాంపియన్ బ్రావో పాటను రూపొందిస్తున్నాడని పేర్కొంది.

టీజర్​లో డ్వేన్ బ్రావో కొంత పాట పాడాడు. 'నా పాటకు ఇది ఓ శాంపిల్​. నా సోదరుడి కోసం నేను ప్రస్తుతం పని చేస్తున్నా' అని వీడియోలో తెలిపాడు. ఎంఎస్ ధోనీ, నంబర్ 7, ఎంఎస్​ ధోనీ, నంబర్ 7 అంటూ మొదలయ్యే ఈ పాత టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. 'రాంచీ మొత్తం ధోనీ అని, భారత్ అంతా మహీ అని, చెన్నై అంతా తలా అని పిలుస్తోంది' అంటూ బ్రేవో వీడియోలో పాడుకొచ్చాడు. ఈ టీజర్​కు ట్విట్టర్​లో లైక్​లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. పూర్తి పాట కోసం వేచిచూడలేకున్నామని ధోనీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే ) జట్టు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో.. ఆ జట్టుపై, కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఒక కుటుంబం లాంటిద‌ని పేర్కొన్నాడు. లీగ్ సంద‌ర్భంగా ధోనీ, కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ త‌న‌పై పూర్తి విశ్వాసం ఉంచుతార‌ని ఈ విండీస్ ప్లేయ‌ర్ చెప్పుకొచ్చాడు. త‌న‌పై ఉన్న న‌మ్మ‌కం కార‌ణంగానే డెత్ ఓవ‌ర్స్‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఇస్తున్నార‌ని తెలిపాడు.

ఎంఎస్ ధోనీకి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌కి తనపై ఎంతో నమ్మకం ఉంటుందని బ్రావో పేర్కొన్నాడు. 'ధోనీ, ఫ్లెమింగ్‌ ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్‌ చేసి బాగా పరుగులు ఇచ్చినా లేక సాధారణంగా పరుగులు ఇచ్చినా.. వాళ్లు నాతో ఒకే విధంగా ఉంటారు. కొన్ని సార్లు విఫ‌ల‌మైనా డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఇచ్చారు. డెత్ ఓవర్లలో నా ప్రతిభను సీఎస్‌కే వెలికి తీసింది. బలమైన ఆటగాళ్లకి వ్యతిరేకంగా ఆడటం అంత సులభం కాదు. కానీ నేను నా ప్రతిభని నమ్ముకొని ఉంటాను' అని బ్రావో పేర్కొన్నాడు.

2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్‌'ని కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

Story first published: Tuesday, April 21, 2020, 20:33 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+