
అది సాక్షి ధోనీ నిర్ణయమే:
హెలికాఫ్టర్ పాటను తమ సారథి ఎంఎస్ ధోనీకి ఫేర్‌వెల్‌గా ఇవ్వలేదని, అలాగే దాన్ని విషాద గీతికగాను ఇవ్వదల్చుకోలేదని డ్వేన్ బ్రావో స్పష్టం చేశాడు. తాజాగా బ్రావో ఓ మీడియాతో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ మీద పాటకు విశేషమైన స్పందన వచ్చింది. అతడి నుంచే కాకుండా సాక్షి ధోనీ నుంచి కూడా మద్దతు లభించింది. ఈ పాటలోని కొన్ని కీలక విషయాలకు సాక్షి సహకరించారు. ఆ పాటకు హెలికాఫ్టర్ అనే పేరు ఆమెనే పెట్టారు. నైనేతే నంబర్ 7గా పిలుద్దామనుకున్నా. ఈ విషయంలో ధోనీ అభిమానులను కూడా సంప్రదించా. దీన్ని రూపొందించినందుకు చాలా సంతోషంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో పంచుకోగానే గంటలో లక్షలాదిమంది వీక్షించారు' అని తెలిపాడు.

రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకోలేదు:
ఎంఎస్ ధోనీ రిటైరవ్వకముందే ఆ పాటను రూపొందించాలని తన సంగీత బృందానికి చెప్పానని, అది అతడికి ఫేర్‌వెల్‌లాగా లేదా విషాద పాటగా కాకూడదనుకున్నట్లు డ్వేన్ బ్రావో చెప్పాడు. 'ధోనీ ఆడుతున్నప్పుడే అతడు సాధించిన ఘనతలను అభివర్ణిస్తూ పాటను తయారు చేయాలనుకున్నా. ఏ ఆటగాడైనా రిటరయ్యే ముందు చాలా మంది అభిమానులు వాళ్ల గురించి మాట్లాడుకుంటారు. నేను మాత్రం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకోలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటమే' అని మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు.

6 పరుగులను కట్టడి చేశా:
'ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నా కూడా ఆ మ్యాచ్‌లో 6 పరుగులను నేను కట్టడి చేశాను. చివరి ఓవర్లలో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అందుకే ఆ మ్యాచ్‌లో మహీని నిలువరించడం నా కెరీర్‌లో పెద్ద సక్సెస్‌గా భావిస్తాను. ధోనీకి మరిన్ని ఓవర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేయాలని ఆశించాను. కానీ ఇక అవకాశం లేదు. ఒక ప్లేయర్‌గా ధోనీ అస్సలు కంగారుపడడు. ఎంత ఒత్తిడినినైనా అధిగమించగలడు. సహచరుల్లోనూ అతను నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. గొప్ప కెప్టెన్ల లక్షణం అది' అని మరో ఇంటర్వ్యూలో బ్రావో తెలిపాడు.

104 మ్యాచుల్లో 121 వికెట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో చాలాకాలంగా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. ధోనీని తన సోదరుడిగా బావిస్తుంటాడు. 2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్'ని కూడా సొంతం చేసుకున్నాడు. సీపీఎల్ 2020 ఆడుతున్న బ్రావో.. ఐపీఎల్ 2020 కోసం సెప్టెంబర్ 10 తర్వాత యూఏఈ వెళ్లనున్నాడు.


Click it and Unblock the Notifications

అబుదాబిలో కఠిన నిబంధనలు.. రెండు దశలలో ఐపీఎల్ 2020?










