Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్కేకు బ్రావో గుడ్‌బై... కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు

కోల్‌కతా నైట్ రైడర్స్ నయా మెంటార్‌గా వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో బాధ్యతలు అందుకున్నాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో బ్రావో ఈ బాధ్యతలు స్వీకరించాడు. గత సీజన్ ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా ట్రోఫీని అందుకుంది.

కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఆటగాళ్లు, కోచ్‌‌లతో పాటు మెంటార్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. తన అనుభవంతో పదునైన వ్యూహాలతో ప్రత్యర్థిపై జట్టు పైచేయి సాధించడంలో, ఆటగాళ్లు బెదురులేని క్రికెట్ ఆడటంలో గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అందుకోవడంతో గౌతమ్ గంభీర్ కేకేఆర్ మెంటార్ పదవిని వదులుకున్నాడు.

Dwayne Bravo Leaves CSK Joins KKR as Mentor for IPL 2025

గంభీర్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావోను కేకేఆర్ తాజాగా నియమించింది. కాగా, క్రికెట్‌కు గురువారమే బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. పోటీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సీపీఎల్ -2024 మధ్యలోనే వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అయిన ట్రింబాగో నైట్ నైడర్స్ తరఫునే బ్రావో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

అయితే కేకేఆర్‌తో పాటు మేజర్ క్రికెట్‌ లీగ్‌లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబి నైట్ రైడర్స్‌తోనూ కలిసి బ్రావో పనిచేయనున్నాడు. ఇక ఐపీఎల్‌లో కోచింగ్ బాధ్యతలు అందుకోవడం బ్రావో ఇది రెండోసారి. ఐపీఎల్‌కు 2022లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2023 నుంచి సీఎస్కే బౌలింగ్ కోచ్ బాధ్యతలు అందుకున్నాడు. మూడు సార్లు ప్లేయర్‌గా సీఎస్కేకే ట్రోఫీ అందించిన బ్రావో 2023లో కోచ్‌గా టైటిల్ సాధించాడు.

కాగా, టైటిళ్లు సాధించడంలో బ్రావోకు అపారమైన అనుభవం ఉంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎన్నో ట్రోఫీలను సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున విభిన్న పాత్రల్లో నాలుగుసార్లు ఛాంపియర్‌గా నిలిచాడు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అయిదు సార్లు టైటిల్ అందుకున్నాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లీగ్‌ల్లోనూ విజేతగా సత్తాచాటాడు.

Story first published: Friday, September 27, 2024, 10:51 [IST]
Other articles published on Sep 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+