న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముందే సంబరాలు మొదలెట్టి.. తీరిగ్గా క్యాచ్ అందుకున్న బ్రావో(వీడియో)

 Dwayne Bravo introduces pre-wicket celebration in T10 League, video goes viral

న్యూ ఢిల్లీ: టీ20 కంటే మించిపోయింది టీ10 ఫార్మాట్. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలపై విరుచుకుపడుతున్న బ్యాట్స్‌మెన్ గురించే అంతా చర్చించుకుంటున్నాం. అయితే తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చర్చనీయాంశమైయ్యాడు. ఎక్కడ టోర్నీ ఆడుతున్నా.. తన మార్క్ సంబరాలతో అభిమానుల్నిఆకర్షిస్తుండే బ్రావో తాజాగా మరోసారి అదే రకంగా మైదానంలో నవ్వులు పూయించాడు. ఎంతలా అంటే తన బంతికి అవుటైన బ్యాట్స్‌మన్ కూడా నవ్వుకుంటూ పెవిలియన్ చేరుకున్నాడు.

 టోర్నీలో మూడో స్థానం కోసం బెంగాల్ టైగర్స్‌తో

టోర్నీలో మూడో స్థానం కోసం బెంగాల్ టైగర్స్‌తో

తాజాగా షార్జా వేదికగా ముగిసిన టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్‌కి ప్రాతినిథ్యం వహించిన డ్వేన్ బ్రావో.. బంతి గాల్లోకి లేవగానే.. వింతైన రీతిలో చేతులతో సంజ్ఞలు చేస్తూ సంబరాలు ఆరంభించాడు. బంతిని క్యాచ్ అందుకుంటూ వాటిని కొనసాగించాడు. టోర్నీలో మూడో స్థానం కోసం బెంగాల్ టైగర్స్‌తో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

మహ్మద్ నబీ.. డ్వేన్ బ్రావో విసిరిన స్లో డెలివరీకి

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగాల్ టైగర్స్ జట్టు 5.1 ఓవర్లు ముగిసే సమయానికి 65/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. ఈ దశలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన మహ్మద్ నబీ.. డ్వేన్ బ్రావో విసిరిన స్లో డెలివరీకి దొరికిపోయాడు.

తీరిగ్గా క్యాచ్ అందుకున్న బ్రావో

తీరిగ్గా క్యాచ్ అందుకున్న బ్రావో

ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వచ్చిన బంతిని మహ్మద్ నబీ హిట్ చేసేందుకు యత్నించి బ్రావో చేతికి చిక్కాడు. ఆ బంతి కాస్తా ఎడ్జ్‌ను తాకడంతో బౌలర్‌ పక్కనే గాల్లోకి లేచింది. గాల్లోకి బంతి లేవగానే.. వికెట్ సంబరాలు ఆరంభించిన బౌలర్ బ్రావో.. ఆ తర్వాత తీరిగ్గా క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు 9.1 ఓవర్లలో 127/4తో లక్ష్యాన్ని ఛేదించింది. టీ10 లీగ్ విజేతగా నార్త్‌రెన్ వారియర్స్ ఘనత దక్కించుకుంది.

Story first published: Monday, December 3, 2018, 18:23 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X