Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాంపియన్‌ సాంగ్‌కు మించి ఉంది: కోహ్లీ, ధోనిపై బ్రావో పాట(వీడియో)

Dwayne Bravo has a new song and its about Virat Kohli, MS Dhoni and Asia

హైదరాబాద్: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అటు మైదానంలో బంతితో పాటు ఇటు మైదానం బయట తన ఆట, పాటలతో అభిమానులను అలరించే విషయం తెలిసిందే. వికెట్‌ తీసినప్పుడైనా.. మ్యాచ్‌ గెలిచినప్పుడైనా సంతోషంలో సరదా డ్యాన్స్ చేస్తుంటాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం 'ఛాంపియన్‌' సాంగ్‌ను బ్రావో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రావో మరో ఆల్భమ్‌ను విడుదల చేశాడు. ఈ సారి ఆసియా క్రికెటర్లను ప్రస్తావిస్తూ అతను పాడిన పాట సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

ఆసియా క్రికెటర్లపై పాట

ఆసియా క్రికెటర్లపై పాట

ఆసియా క్రికెటర్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, విరాట్‌ కోహ్లీ, ధోని, షకీబ్ ఉల్ హసన్‌, షాహిదీ అఫ్రీదీ, రషీద్‌ ఖాన్‌లను ప్రస్తావిస్తూ ‘దిస్‌ వన్‌ ఈజ్‌ ఏషియా' గా ఈ పాటను రూపొందించాడు. ఈ సాంగ్‌ను పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహీద్‌ అఫ్రిది కొనియాడుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

బ్రావో అద్భుతం

"బ్రావో అద్భుతం.. ఇది పక్కా చాంపియన్‌ సాంగ్‌కు మించి ఉంది. ముఖ్యంగా ఈ పాటలో నా పేరు ప్రస్తావించడం బాగుంది. ఇది విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా" అని ట్వీట్‌ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

బ్రావో 2018 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ లయన్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగాడు. అలాగే పీఎస్‌ఎల్‌, బీబీఎల్‌, సీపీఎల్‌ల్లో కూడా పాల్గొన్నాడు. టెస్ట్‌ల్లో 86 వికెట్లతో 2200 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. వన్డేల్లో 2986 పరుగులు చేసి 199 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 52 వికెట్లతో పాటు 1142 పరుగులు తీశాడు.

Story first published: Sunday, February 10, 2019, 9:30 [IST]
Other articles published on Feb 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+