For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కొత్త అవతారం...

Dwayne Bravo give Chennai Super Kings teammate a new hairstyle

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. మైదానంలో వికెట్ తీసినా.. లేదా క్యాచ్ పట్టినా తన డాన్సులతో స్టేడియంలోని అభిమానులను అలరిస్తుంటాడు. అభిమానులనే కాదు సహచర ఆటగాళ్లను కూడా ఉత్తేజపరుస్తుంటాడు. ఈ క్రమంలో డ్వేన్ బ్రావో మరో సరికొత్త అవతారం ఎత్తాడు.

Dwayne Bravo give Chennai Super Kings teammate a new hairstyle

హెయిర్‌ స్టయిలిస్టుగా బ్రావో:
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోబ్రావోకు తొడ కండరాలు పట్టేయడంతో లీగ్‌కు రెండు వారాల పాటు దూరమయ్యాడు. గాయపడ్డ బ్రావో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ కాళీ సమయంలో బ్రావో సరికొత్త అవతారం ఎత్తాడు. సహచర ఆటగాడు మోనూ సింగ్‌కు బ్రావో హెయిర్‌ స్టయిలిస్టుగా మారాడు. ట్రిమ్మర్‌తో మోనూ సింగ్‌ తల వెంట్రుకలు మొత్తం కట్‌ చేశాడు. అనంతరం గడ్డం కూడా చేసాడు. దీనికి బదులుగా మోనూ.. బ్రావోకు ఓ హాగ్ ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

బ్రావోకు బదులు కుగెల్జిన్‌:
బ్రావోకు గాయం అవడంతో.. కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బదులుగా తుది జట్టులోకి కివీస్ ఆల్‌రౌండర్ స్కాట్ కుగెల్జిన్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుగెల్జిన్‌ తన కోటా 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. బ్యాటింగ్ మాత్రం అతనికి రాలేదు. ఈ రోజు రాత్రి చెన్నై, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా స్కాట్ కుగెల్జిన్‌ను తీసుకునే అవకాశం ఉంది.

Story first published: Tuesday, April 9, 2019, 11:51 [IST]
Other articles published on Apr 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+