కుమార సంగాక్కర బదులుగా డేన్ బ్రావో

హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ కెప్టెన్‌గా టీ10 క్రికెట్ లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జట్టులో కీలక ఆటగాడైన కుమార సంగక్కర వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. జట్టు ఆ లోటును వెస్ట్ ఇండియన్ ఆటగాడు డేన్ బ్రావో తీర్చనున్నాడు. రానున్న టీ10 క్రికెట్ లీగ్‌లో సెహ్వాగ్ సారథ్యంలో డేన్ బ్రావో మ్యాచ్ ఆడనున్నాడు.
ఈ జట్టులో డేన్ బ్రావోతో పాటుగా మొహమ్మద్ అమీర్, కమ్రాన్ అక్మల్ ఆడుతున్నారు. జట్టుకు ప్రధాన కోచ్‌గా, వ్యాఖ్యాతగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం వ్యవహరించనున్నాడు. అసిస్టెంట్ కోచ్ ఇంగ్లాండ్ స్కాట్‌లాండ్ కు చెందిన డోగి బ్రౌన్ బాధ్యతలు వహిస్తాడు.
'సెహ్వాగ్ మాట్లాడుతూ.. కుమార సంగక్కర వ్యక్తిగత కారణాల వల్ల ఆడేందుకు వీలు కావట్లేదు. ఆల్‌రౌండర్ డేన్ బ్రావో ఆ లోటును తీర్చగలడని అనుకుంటున్నాను'అని తెలిపాడు.' అయినా మేము అంతే స్థాయిలో అదృష్టవంతులం కూడా అని డేన్ బ్రావో మా జట్టు స్థాయిని పెంచుతాడనే నమ్మకముంది' అని కొనియాడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications