న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో 10000 పరుగులిచ్చేసి.. ఘనత కొట్టేసిన ప్లేయర్

Dwayne Bravo becomes the first to concede 10000+ runs in T20s

హైదరాబాద్‌: టెస్టు క్రికెట్‌కు ఉన్న క్రేజ్ నంతటినీ దోచేసుకున్న టీ20 అంటే.. రికార్డులు, అదిరిపోయే షాట్‌లు, కళ్లని మరిపించే క్యాచ్‌లు. అలాంటి టీ20ల్లో అద్భుతమైన రికార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బ్రావో ఎప్పుడో చేరిపోయాడు. మైదానంలో ఉన్నప్పుడు వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు చేసుకునే సంబరాలు అంతా ఇంతా కాదు. ఈ ఫార్మాట్‌లో అతను పదివేల పరుగులకు పైగా ఇవ్వడం అనేది చర్చనీయాంశమే.

వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ఓ అనూహ్య ఘనత సాధించాడు. టీ20‌లో పదివేలకు పైగా పరుగులిచ్చిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అతడి కెరీర్‌లో దాదాపు 19 జట్ల తరఫున 391 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మధ్యే ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదకొండో సీజన్‌లో మళ్లీ చెన్నై తరఫున ఆడిన బ్రావో తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. బౌలింగ్‌లో ఎక్కువ పరుగులే ఇచ్చినా కొన్ని మ్యాచుల్లో డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బంతులు విసిరాడు.

టీ20ల్లో 427 వికెట్లు తీసిన బ్రావో 1254.2 ఓవర్లు వేసి 10,000కు పైగా పరుగులు ఇచ్చాడు. ఎకానమీ 8.20. ఎంతో మంది యువ ఆటగాళ్లు వస్తున్నా బ్రావో లాంటి తెలివైన ఆల్‌రౌండర్‌ లేకపోవడంతో అతడి కెరీర్‌ విజయవంతంగా కొనసాగుతోంది. 2008వ సంవత్సరం ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన బ్రావో 122 మ్యాచ్‌లు ఆడి 1379 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలింగ్ విషయానికొస్తే.. 3251 పరుగులిచ్చి 136 వికెట్లు తీయగలిగాడు. ప్రస్తుత సీజన్‌కు 6.40 కోట్లకు ఇతన్ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

ఇక ఐపీఎల్ 2018 విషయానికొస్తే.. 16 మ్యాచ్‌లు ఆడి 141 పరుగులు చేయగలిగాడు. దీంతోపాటుగా ఆల్‌రౌండర్ అయిన బ్రావో.. 14 వికెట్లు తీశాడు. ఈ సీజన్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు ప్రతి మ్యాచ్‌లోనూ బ్రావో పాల్గొన్నాడు.

Story first published: Saturday, June 2, 2018, 12:40 [IST]
Other articles published on Jun 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X