Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. స్టార్ ఆల్రౌండర్ దూరం, అతని స్థానంలో ఎవరంటే?

Dwaine Pretorious Ruled Out from T20 World cup and He Suffered from Right Thumb Injury

టీ20 ప్రపంచకప్ ముందు దక్షిణాఫ్రికా టీంకు షాక్ తగిలింది. ఆ టీం ఆల్రౌండర్ డ్వెయిన్ ప్రిటోరియస్‌కు ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతను దూరమయ్యాడు. లక్నోలో నేడు భారత్‌తో ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌కు కూడా ప్రిటోరియస్ దూరమయ్యాడు. ఇక ప్రిటోరియస్ స్థానంలో దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ బొటన వేలి గాయం కారణంగా వన్డే సిరీస్‌కు, ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని క్రికెట్ సౌతాఫ్రికా ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఇక అతని స్థానంలో మార్కో జాన్సేన్ జట్టులోకి వచ్చే వీలుంది.

అక్టోబరు 24న హోబర్ట్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి రౌండ్‌లో గ్రూప్ Bలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-2తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారత పేస్ ద్వయం అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ టాపార్డర్‌ను కుప్పకూల్చగా.. కేశవ్ మహారాజ్, వేన్ పార్నెల్ కాసేపు పోరాడడంతో దక్షిణాఫ్రికా 106పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే రెండో మ్యాచ్‌లో 238పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం కరిగిస్తూ డేవిడ్ మిల్లర్ సెంచరీతో, క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో వీరోచిత పోరాటం చేశారు. కేవలం 16పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో రిలీ రోసౌ సెంచరీతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 200పైచిలుకు స్కోరు చేయగా.. భారత్ పెద్దగా ప్రతిఘటించకుండానే ఓటమి పాలయింది.

దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ జట్టు :
టెంబా బావుమా ( కెప్టెన్ ), క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నార్జ్‌, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిల్లీ రోసౌవ్, తబ్రైజ్ షమ్సీ,
స్టాండ్‌బై ప్లేయర్స్: బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో.

Story first published: Thursday, October 6, 2022, 17:56 [IST]
Other articles published on Oct 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+