Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దస్ గుణ లగాన్ వసూల్: 350 ఛేజింగ్‌పై సెహ్వాగ్ ట్వీట్

హైదరాబాద్: పూణె వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జాదవ్ ఆటతీరుపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించగా తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

కేదార్ జాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ గెలవడం ఒకేసారి పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుందని సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు అనంతరం తొలి ట్వీట్‌లో జై జాదవ్ అని పేర్కొన్న సెహ్వాగ్ ఆ తర్వాత ట్వీట్‌లో 'దస్ గుణ లగాన్ వసూల్' అని పేర్కొన్నాడు.

ఆదివారం పూణెలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ లక్ష్య ఛేదనలో కోహ్లి 122 జాదవ్ 120 పరుగులతో సెంచరీలు చేసి భారత గెలుపులో ముఖ్యభూమిక పోషించారు.

సచిన్ టెండూల్కర్

ఈ ఏడాదిని టీమిండియా విజయంతో ఆరంభించడంపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారత జైత్రయాత్రకు తొలి అడుగు అని కొనియాడాడు.

వీవీఎస లక్ష్మణ్

ఒత్తిడిలో కూడా కేదార్ జాదవ్ అద్భుతంగా ఆడాడు. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నందుకు టీమిండియాకు అభినందనలు. కోహ్లీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారని లక్ష్మణ్ కొనియాడాడు.

ఇర్ఫాన్ పఠాన్

63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా అద్భుతమైన ఛేజింగ్ చేసిందంటూ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.

మహ్మద్ కైఫ్

తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించిన టీమిండియాకు మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపాడు. కేదార్ జాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

హర్షా భోగ్లే

ఇండియా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా 350 పరుగుల రన్ ఛేజింగ్లో ఇండియా బ్యాటింగ్ సత్తా ఏంటో తెలిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+