SL Vs PAK 2nd Test: స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక అభిమానులు కలిసి బతుకమ్మ తరహా డ్యాన్స్ చేస్తూ సందడి..?

గాలే వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు శ్రీలంక కాస్త పాక్ మీద ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 5వికెట్లు కోల్పోయి 176పరుగులు చేసి 323పరుగుల ఆధిక్యంతో కాస్త బెటర్ విజయావకాశాలతో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 231పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో రమేష్ మెండిస్ మరోసారి 5వికెట్ల హాల్ సాధించగా.. అలాగే స్పిన్ సంచలనం ప్రభాత్ జయసూర్య సైతం మూడు వికెట్లతో చెలరేగి పాక్ పతనాన్ని శాసించారు.
సేమ్ బతుకమ్మ టైప్‌లో
ఇక మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఓ డిఫెరెంట్ సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకుంది. శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. స్టేడియంలోని ఓ పక్కా స్టాండ్స్ లేని కేవలం గ్రాస్ ఉన్న ప్రాంతంలో పలువురు శ్రీలంకన్, పాకిస్థాన్ అభిమానులు కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తరహా స్టెప్పులు వేశారు. తెలంగాణలో బతుకమ్మ ఎంత పెద్ద పండగో తెలిసిందే. లయబద్ధంగా పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఓ సారి కింద చప్పట్లు కొట్టి మరోసారి పైకి లేసి భుజాల వద్ద చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటతో మహిళలు ఆడిపాడతారు. సేమ్ అదే తరహాలో ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో స్టెప్పులేసి అలరించారు.
కొత్త రకం డ్యాన్స్ స్టెప్పులేయడానికి టైమొచ్చింది
పాకిస్థాన్, శ్రీలంక అభిమానులు కలిసి ఈ స్టెప్పులు వేయడం గమనార్హం. పైగా ఇరు దేశాల అభిమానులు తమ దేశాల జెర్సీలు ధరించి.. జెండాలు పట్టుకుని ఈ రకంగా స్టెప్పులేశారు. ఈ సెలబ్రేషన్‌పై శ్రీలంక క్రికెట్ సైతం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో స్పందించింది. ఈ వీడియోను పోస్టు చేస్తూ.. కొత్త రకం డ్యాన్స్ నేర్చుకోవడానికి టైమొచ్చిందంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే కొంచెం బతుకమ్మ డ్యాన్స్‌కు ఇది డిఫరెంట్‌గా ఉంది.
పాకిస్థాన్ సంప్రదాయ నాట్యమటా..!
ఇది బతుకమ్మ డ్యాన్స్ కాదు. పాకిస్థాన్లో గర్బా అని పిలిచే ఓ సంప్రదాయ డ్యాన్స్. దీన్నే లుడ్డీ, సొంబీ, జాహ్మర్ అని కూడా అంటుంటారు అని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ ట్వీట్ తెగ రిట్వీట్ అవుతుంది. పైగా లైకులు కూడా బానే వస్తున్నాయి. తొలిసారి తెలంగాణ వాళ్లు చూస్తే మట్టుకు మా బతుకమ్మ డ్యాన్స్ వీళ్లు కాపీ కొట్టిండ్రు అనుకోడం పక్కా.

ఇక మ్యాచ్ విషయానికొస్తే..
తొలి ఇన్నింగ్స్‌లో 147పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో చాలా తడబడింది. ఓపెనర్లు డిక్వెల్లా (15), ఓషాదో ఫెర్నాండో (19) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (15) సైతం త్వరగానే ఔటవ్వడంతో 59పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ (35), ఇన్ ఫామ్ బ్యాటర్ దినేష్ చండిమాల్ (21) కాసేపు పోరాడారు. అయితే వీరిద్దరు వెనువెంటనే ఔటవ్వడంతో 117పరుగులకే 5వికెట్లు కోల్పోయి శ్రీలంక ఇన్నింగ్స్ గాడితప్పినట్లు కన్పించింది. అయితే వెన్ను నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక సారథి కరుణరత్నే (27నాటౌట్), ధనంజయ డిసిల్వా (30 నాటౌట్) మూడో రోజు ఆట ముగిసేవరకు క్రీజులో నిలబడ్డంతో శ్రీలంక గెలుపు అవకాశాలు కాస్త మెరుగయ్యాయి.

మ్యాచ్ సమ్మరీ :
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 378
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 231
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 176/5 (మూడో రోజు ఆట ముగిసే సమయానికి)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications