Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాట్‌స్టార్ బద్ధలయ్యేలా రికార్డ్ రియల్ టైం వ్యూయర్‌షిప్.. వచ్చి రాగానే దంచికొడుతున్న భారత బ్యాటర్లు

During India vs Pakistan Match Record Realtime Viewership of 1crore on Disney Hotstar

ఆసియాకప్ 2022లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్ 4మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు విపరీతంగా చూస్తున్నారు. ఇండియా తొలుత బ్యాటింగ్ చేయడంతో టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు. ఇక ఈ మ్యాచ్ ప్రసారం చేసే డిస్నీ హాట్ స్టార్ వీక్షకుల సంఖ్య ఓ రేంజులో ఉంది. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ సంఖ్య చూస్తే ఈ మ్యాచ్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఏకంగా ఒక కోటీ 10లక్షల మంది లైవ్ రియల్ టైం చూస్తున్నట్లు హాట్ స్టార్ లోగో వద్ద కన్పించింది. రియల్ టైంలో ఈ రేంజులో ప్రేక్షకులు చూస్తున్నారంటే.. ఈ మ్యాచ్ హంగామా ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రియల్ టైం ఏ మ్యాచ్‌కైనా 4లక్షలు, 5 లక్షలు ఉంటే మహా ఎక్కువ.. అలాంటిది కోటికి తగ్గకుండా మ్యాచ్ నడుస్తుండడం అమోఘమనే చెప్పాలి.

ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత్‌కు మంచి శుభారంభం దక్కింది. నషీమ్ షా వేసిన తొలి ఓవర్లోనే ఫోర్,సిక్సర్ కొట్టి రోహిత్ తన అగ్రెసివ్ నెస్ చూపించాడు. ఇక స్లో ఆడతాడనుకునే కేఎల్ రాహుల్ సైతం తన బ్యాట్ పవర్ చూపించాడు. నసీమ్ షా వేసిన మూడో ఓవర్లో 2సిక్సులు కొట్టి తన బ్యాట్ ఝళిపించాడు. వీరిద్దరు ధాటిగా ఆడడంతో 5ఓవర్లకే స్కోరు 54కు చేరుకుంది. హిట్టింగ్ చేయాలని చూసిన రోహిత్ (28పరుగులు 14బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ (28పరుగులు 20బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. వచ్చీరాగానే ఫోర్‌తో మొదలెట్టిన సూర్యకుమార్ యాదవ్ (13పరుగులు 2ఫోర్లు) క్యాచ్ ఔటయ్యాడు. 10ఓవర్లకు ఇండియా 3వికెట్లు కోల్పోయి 93పరుగులు చేసింది.
తుది జట్లు:

భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌‌), కేఎల్ రాహుల్‌‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్‌‌.
పాకిస్తాన్‌‌: బాబర్‌‌ ఆజామ్ (కెప్టెన్‌‌), రిజ్వాన్‌‌ (వికెట్ కీపర్‌‌), ఫాఖర్ జమాన్‌‌, ఇఫ్తికర్‌‌, కుష్దిల్‌‌, షాదాబ్‌‌, ఆసిఫ్‌‌, నవాజ్‌‌, నసీమ్‌‌, రవూఫ్‌‌, హాస్నైన్

Story first published: Sunday, September 4, 2022, 20:52 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+