షాకింగ్ ఘటన.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన జనాలు

ష్పగీజా క్రికెట్ లీగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం నిర్వహించే ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్. ఇందులో ఎనిమిది ఫ్రాంచైజీలుంటాయి. ఇందులో జాతీయ జట్టుతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఆడతారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్ 'A' టీం, అండర్ 19జట్టు ప్లేయర్లతో పాటు వివిధ రీజన్లలో ఎలైట్ ప్రదర్శనకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటారు. ప్రతి జట్టుకు డ్రాఫ్ట్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతుంది.
బాంబు పేలుడు ఘటన తర్వాత స్టేడియంలో గందరగోళం ఏర్పడింది. స్టేడియంలో ఉన్న వారందరూ ఈ హఠాత్పారిణామానికి బిక్కచచ్చిపోయారు. ఇక ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ప్రేక్షకులు స్టేడియం బయటకు సురక్షితంగా బయటపడ్డానికి పరుగెత్తారు. ష్పగీజా లీగ్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. మ్యాచ్ టైంలో ఒక పేలుడు సంభవించిందని ఓ నలుగురు పౌరులు గాయపడ్డారని ACB చీఫ్ ఎగ్జిక్యూటివ్, నాసిబ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాబూల్‌లోని గురుద్వారా కార్తే పర్వాన్ గేట్ సమీపంలో పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications