For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. మరో ఇంగ్లాండ్ క్రికెటర్

Durhams former England captain to retire at end of season

హైదరాబాద్: ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో అలిస్టర్‌ కుక్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 22ఏళ్ల క్రితం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో కెరీర్‌ను ఆరంభించిన కాలింగ్‌వుడ్‌ ఇంగ్లాండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

కాలింగ్‌వుడ్‌ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్‌ జట్టు మూడుసార్లు యాషెస్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, 2010లో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. తన కెరీర్‌లో కాలింగ్‌వుడ్‌ 68 టెస్టులు, 197 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

'సుదీర్ఘ ఆలోచనలు, చర్చల అనంతరం క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. ఈ సీజన్‌లోనే నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతా' అని కాలింగ్‌వుడ్‌ తెలిపారు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి రోజు వస్తుందని తనకు తెలుసని, అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలికకాదని అభిప్రాయపడ్డాడు.

కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ధాటిగా రాణిస్తున్న జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ విషయం గురించి ప్రశ్నించగా అలాంటి ఉద్దేశ్యం లేదన్నాడు. సాధించాల్సింది చాలా ఉందని.. రిటైర్ అయిన తర్వాత చూసుకుంటే మనం సాధించేంటో కనిపించాలని పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం టీమిండియాతో ఆడిన ఆఖరి టెస్టు అనంతరం అలెస్టర్ కుక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కుక్.. అండర్సన్ కంటే వయస్సు రీత్యా చిన్నవాడే.

Story first published: Friday, September 14, 2018, 13:15 [IST]
Other articles published on Sep 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+