టెస్టు మధ్యలో మోగిన ఫైర్ అలారం: ఆగిన మ్యాచ్, వచ్చిన ఫైరింజన్
హైదరాబాద్: డ్యునెడిన్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు చివరి సెషన్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన స్టేడియం నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బందితో పాటు భద్రతాదళ సిబ్బింది స్టేడియం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ముందస్తు జాగ్రత్త కోసం నీటితో స్టేడియం మొత్తాన్ని నీటితో తడిపారు.
308 పరుగులకే అలౌటైన దక్షిణాఫ్రికా
అనంతరం ఫైర్ అలారం మోగడానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించగా వారికి ఎటువంటి ఆధారాలు లభించకపోవడం గమనార్హం. డ్యునెడిన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకే ఆలౌటైంది.
దక్షిణాఫ్రికాపై 33 పరుగుల ఆధిక్యం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలపై కివీస్ 33 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో శుక్రవారం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 14/1 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఫైర్ అలారం మోగింది.
మైదానం మధ్యలోకి వచ్చిన అభిమానులు, ఆటగాళ్లు
దీంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లు, అభిమానులు ఏం జరిగిందా? అని చూస్తుండిపోయారు. మరోవైపు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆటగాళ్లు, కామెంటేటర్స్, స్టేడియం నిర్వాహకులు, టీవీ సిబ్బంది తదితరులు ఫైర్ అలారం మోగిన వెంటనే మైదానం మధ్యలోకి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అభిమానులను స్టేడియం నుంచి బయటకు తరలించారు.
మ్యాచ్‌ను నిలిపివేసిన అంఫైర్లు
అదే సమయంలో ఏం జరిగిందో తెలియక అంఫైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇలా అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది అప్రమత్తమై చివరకు స్టేడియంలో ఏమీ లేదని తేల్చడంతో 20నిమిషాల తర్వాత ఆటను తిరిగి ప్రారంభించారు. అయితే మూడో రోజు వెలుతురు లేని కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు.
వికెట్ నష్టానికి 38 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
దీంతో తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌పై 5 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications