For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా బ్లూ: ఫైనల్లో ఇండియా రెడ్‌ ఓటమి

By Nageshwara Rao
Duleep Trophy: Spinners Saurabh Kumar, Deepak Hooda dismantle India Red as India Blue register innings win in final

హైదరాబాద్: దులీప్‌ ట్రోఫీని ఇండియా బ్లూ గెలుచుకుంది. శుక్రవారం ముగిసిన ఫైనల్లో 'బ్లూ' ఇన్నింగ్స్‌ 187 పరుగులతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండియా రెడ్‌ను చిత్తు చేసింది. ఫాలోఆన్‌ ఆడుతూ ఓవర్‌నైట్‌ స్కోరు 128/5తో నాలుగో రోజు, శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెడ్‌.. 172 పరుగులకు ఆలౌటైంది.

స్పిన్నర్లు దీపక్‌ జగ్బీర్‌ హుడా (5/56), సౌరవ్‌ కుమార్‌ (5/51) ఇండియా రెడ్‌ పతనాన్ని శాసించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 128/5తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇండియా రెడ్ మరో 44 పరుగులకు మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.

అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా బ్లూ 541 పరుగులు చేయగా.. రెడ్‌ 182 పరుగులకే కుప్పకూలింది. నిఖిల్‌ గంగ్టాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు:
ఇండియా బ్లూ తొలి ఇన్నింగ్స్‌: 541 (నిఖిల్‌ గంగ్టా 136, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ 96, స్వప్నిల్‌ సింగ్‌ 69; పర్వేజ్‌ రసూల్‌ 4/150, మిహిర్‌ హిర్వాణి 3/19)
ఇండియా రెడ్‌ తొలి ఇన్నింగ్స్‌: 182 (సందీప్‌ 57; స్వప్నిల్‌ సింగ్‌ 5/58)
ఇండియా రెడ్‌ రెండో ఇన్నింగ్స్‌: 172 (అభినవ్‌ ముకుంద్‌ 46; సౌరభ్‌ కుమార్‌ 5/51, దీపక్‌ హూడా 5/56)

Story first published: Saturday, September 8, 2018, 9:26 [IST]
Other articles published on Sep 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+