Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్!

Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 202627 ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 44 పరుగులు సాధించాడు.

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

వైభవ్ ఔట్ కావడానికి కారణం
హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఫాస్ట్ బౌలర్ చామ మిలింద్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని సిక్సర్‌గా మలచి అర్థ శతకం పూర్తి చేయాలని ప్రయత్నించాడు.అయితే ఆ బంతి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ తానయ్ త్యాగరాజన్ చేతికి చిక్కడంతో వైభవ్ సూర్యవంశీ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. అంతకు ముందు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ కలిసి తొలి వికెట్‌కు అద్భుతమైన శతక భాగస్వామ్యాన్ని(100 పరుగులు) అందించారు.

Duleep Trophy Final Vaibhav Sooryavanshi Misses Half-Century After Impressive Knock Full Details Here

బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ ప్రతాపం
క్రీజులోకి వచ్చిన వెంటనే వైభవ్ సూర్యవంశీ తన జోరును ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే అద్భుతమైన బౌండరీ బాదాడు. ఆ తర్వాత మహ్మద్ నిధిష్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టగా.. తిరిగి మహమ్మద్ సిరాజ్ ఓవర్లో ఏకంగా 14 పరుగులు పిండుకుని ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

Also Read

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

టోర్నీలో వైభవ్ సూర్యవంశీ ప్రయాణం
ఈ టైటిల్ పోరులో తూర్పు జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో సౌత్ జోన్ జట్టులో మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఇక ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో తక్కువ పరుగులు చేసినప్పటికీ బౌలింగ్లో రాణించిన వైభవ్ సూర్యవంశీ.. సెమీ-ఫైనల్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో(92, 40 పరుగులు) దులీప్ ట్రోఫీలో అర్థ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

Story first published: Sunday, September 6, 2026, 12:17 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+