Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

భారత ప్రతిష్టాత్మక దేశీయ క్రికెట్ టోర్నీమెంట్ అయిన దులీప్ ట్రోఫీ 2026 కోసం ఈస్ట్ జోన్ జట్టును ప్రకటించారు. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. చిన్న వయసులోనే ఇలాంటి కీలక బాధ్యతను స్వీకరించడం.. మరో పాత్రలో తనను తాను నిరూపించుకోవడానికి వైభవ్ సూర్యవంశీకి ఓ అవకాశంగా నిలుస్తుంది.

గౌతమ్ గంభీర్ టీమ్‌లో భారీ మార్పులు.. ఆ ఇద్దరూ ఔట్!

గౌతమ్ గంభీర్ టీమ్‌లో భారీ మార్పులు.. ఆ ఇద్దరూ ఔట్!

గత సంవత్సరం ప్రకటించిన తూర్పు జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అతడికి ఇంతకు ముందు కూడా కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది ఇషాన్ కిషన్ ఫైనల్‌లో హర్యానాను 69 పరుగుల భారీ తేడాతో ఓడించి.. జార్ఖండ్‌కు వారి మొదటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లోని మొదటి ఏడు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా నాయకత్వం వహించాడు.మరోవైపు 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశి వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం ఈ జట్టుకు ఓ చెప్పుకోదగ్గ విజయం. వైభవ్ సూర్యవంశీ దక్షిణాఫ్రికా పర్యటనలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్ విజయాన్ని అందించాడు. వైభవ్ తన కొత్త బాధ్యతను ఎలా నిర్వహిస్తాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Duleep Trophy 2026 Ishan Kishan Named East Zone Captain Vaibhav Sooryavanshi Vice Captain

మహమ్మద్ షమీకి స్థానం
భారత ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్‌లను బౌలింగ్ విభాగంలోకి చేర్చారు. ఈ ఇద్దరు బౌలర్లకు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉంది. వారి రాక జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తుంది. 2027 ప్రపంచ కప్ జట్టులో షమీకి చోటు దక్కాలని కొంతమంది క్రికెట్ నిపుణులు భావిస్తున్నందున.. షమీ ప్రదర్శనను నిశితంగా గమనిస్తారు. అంతేకాకుండా ఈస్ట్ జోన్ జట్టులో అభిమన్యు ఈశ్వరన్ వంటి బ్యాటర్ కూడా ఉన్నాడు. షాబాజ్ అహ్మద్, అనుకుల్ రాయ్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు.

2027 ప్రపంచకప్ గెలవాలంటే ఇంతకంటే మంచి జట్టు మరొకటి ఉండదు భయ్యా!

2027 ప్రపంచకప్ గెలవాలంటే ఇంతకంటే మంచి జట్టు మరొకటి ఉండదు భయ్యా!

2026 దులీప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామీ, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, డానిష్ దాస్, అభిజిత్ సర్కార్

Story first published: Wednesday, July 29, 2026, 20:20 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+