టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఏడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని షాట్‌కు యత్నించి మిడాన్‌లో ఉన్న అకీబ్ చేతికి చిక్కాడు.
దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జట్టుకు శ్రేయస్ సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్‌పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. సన్‌గ్లాసెస్‌తో హీరోలో వచ్చి జీరోకి ఔటయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అనంతపురంలో ఇవాళ సూర్యుడు కాస్త ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తుండటంతో శ్రేయస్ కళ్లద్దాలతో బ్యాటింగ్‌కు వచ్చాడు.

సాధారణంగా బ్యాటర్లు సన్‌గ్లాసెస్ ధరించి బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. కానీ శ్రేయస్ ఇలా కళ్లద్దాలతో రావడంతో నెట్టింట్లో అతని ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే కాసేపటికే అతను డకౌట్వడంతో ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా, ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం భారత టెస్టు జట్టులో శ్రేయస్ అయ్యర్ చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.
జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అయితే తిరిగి టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని పట్టుదలతో ఇటీవల తిరిగి రెడ్ బాల్ క్రికెట్ ప్రారంభించిన శ్రేయస్ నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నాడు. తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన శ్రేయస్ తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఇక దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఇండియా-సీతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో (54) ఫర్వాలేదనిపించాడు. ఇవాళ ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో డకౌటయ్యాడు. నిలకడగా పరుగులు చేయడంలో శ్రేయస్ విఫలమవుతున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములాని (89) సెంచరీ సాధించలేకపోయాడు. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-డీ ఆరు పరుగులకే అథర్వ (4), శ్రేయస్ వికెట్లు కోల్పోయింది.
Shreyas Iyer dismissed for a duck in Duleep Trophy 2024 pic.twitter.com/MXJb4IvkKW
— Dev Sharma (@Devsharmahere) September 13, 2024
Came with Sunglasses and gone for a duck 🦆 😁 #Shreyasiyer pic.twitter.com/O6Y29PLWOk
— Prakash (@definitelynot05) September 13, 2024