Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy: వారిద్దరి వల్లే ఓడాం: శ్రేయస్ అయ్యర్

దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా-డీ జట్టు రెండో రౌండ్‌లోనూ బోణీ కొట్టలేదు. అనంతపురం వేదికగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓవర్‌నైట్ స్కోరు 62/1తో, 488 పరుగుల భారీ లక్ష్యంతో ఇవాళ ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-డీ 301 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రా కుర్రాడు రికీ భుయ్ (113; 195 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్సర్) పోరాడాడు.

ఇవాళ ఆట ఆరంభమైన కాసేపటికే యశ్ దూబె (34), ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో దేవదత్ పడిక్కల్ (1) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (41), సంజు శాంసన్ (40)తో కలిసి రికీ భుయ్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ జట్టు-ఏ బౌలర్లు పుంజుకుని కీలక దశలో వికెట్లు పడగొట్టారు. అయ్యర్‌తో రికీ భుయ్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు, శాంసన్‌తో అయిదో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. తనుష్ కొటియన్ నాలుగు, షామ్స్ ములాని మూడు వికెట్లు తీశారు.

Duleep Trophy 2024 Shreyas Iyer Reflects on Defeat We Were on the Mark Early But Key Partnership Shifted Momentum

కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమికి గల కారణాలు ఇండియా-డీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును 95/5 స్కోరుకే కట్టడి చేశామని, కానీ షామ్స్ ములాని (89), తనుష్ కొటియన్ (53) సత్తాచాటి తమను దెబ్బకొట్టారని శ్రేయస్ అన్నాడు. ''మేం మొదటి బంతి నుంచే ఆధిపత్యం చెలాయించాం. ఆదిలోనే నాలుగు వికెట్లు పడగొట్టాం. కానీ షామ్స్, కొటియన్ అద్భుతంగా ఆడారు''

''వారిద్దరు 120 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మా చేతుల్లో నుంచి లాగేసుకున్నారు. ఇక మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో వెనుకంజలో ఉన్నాం. బంతి టర్న్ అయ్యింది. మా బ్యాటర్లు మిస్ అయ్యారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వాళ్లు గొప్పగా బ్యాటింగ్ చేశారు. 488 పరుగుల లక్ష్యం అంత ఈజీ కాదు. దాన్ని ఎలా ఛేదించాలో సన్నద్ధమయ్యాం. వచ్చే మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నాం'' అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.

స్కోరు వివరాలు
ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌: 290 ఆలౌట్; షామ్స్ ములాని (89), హర్షిత్ రాణా 4/51
ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్: 183 ఆలౌట్; దేవదత్ పడిక్కల్ (92), ఖలీల్ అహ్మద్ 3/39
ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్: 380/3 డిక్లేర్; ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111*), సౌరభ్ 2/110
ఇండియా-డీ రెండో ఇన్నింగ్స్: 301 ఆలౌట్; రికీ భుయ్ (113), తనుష్ 4/73.

Story first published: Sunday, September 15, 2024, 18:42 [IST]
Other articles published on Sep 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+