దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ ప్రారంభమైంది. అనంతపురం వేదికగా ఇండియా-ఏతో ఇండియా-డీ, ఇండియా-బీతో ఇండియా-సీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇండియా-బీ, ఇండియా-డీ బౌలింగ్ ఎంచుకున్నాయి. తొలి రౌండ్‌లో ఇండియా-ఏపై ఇండియా-బీ, ఇండియా-డీపై ఇండియా-సీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
వైట్ బాల్ స్టార్ క్రికెటర్లు సంజు శాంసన్, రింకూ సింగ్ రెడ్ బాల్ క్రికెట్‌కు తిరిగొచ్చారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇండియా-డీ తరఫున శాంసన్ బరిలోకి దిగాడు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో ఇండియా-బీ జట్టులోకి రింకూ సింగ్ వచ్చాడు. మరోవైపు తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఛాన్స్ వచ్చింది. ఇండియా-ఏకు తిలక్ వర్మ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ జట్టును మయాంక్ అగర్వాల్ నడిపిస్తున్నాడు.

తుది జట్లు
ఇండియా-ఏ: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ప్రథమ్ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, షెష్వాత్ రావత్, కుమార్ కుషాగ్రా, షామ్స్ ములాని, తనుష్ కొటియన్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అకిబ్ ఖాన్.
ఇండియా-బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), జగదీశన్, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, రింకూ సింగ్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, సాయి కిశోర్, నవ్‌దీప్ సైని, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్.
ఇండియా-సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, రజత్ పటిదార్, ఇంద్రజీత్, అభిషేక్ పోరెల్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, మయాంక్ మార్కండె, విజయ్‌కుమార్ వైశాక్, సందీప్ వారియర్
ఇండియా-డీ: అథర్వ తైడే, యశ్ దూబె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, రికీ భుయ్, సారాన్ష్ జైన్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, విద్వాత్ కవెరప్ప.