మైదానంలో రిషభ్ పంత్ చేసే అల్లరి గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థులు, అంపైర్లతో సరదాగా ఉంటాడు. అయితే కారు ప్రమాదానికి గురై పంత్ 18 నెలలు ఆటకు దూరమవ్వడంతో ఆ సందడిని అభిమానులు మిస్ అయ్యారు. మూడు నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి పంత్ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ మునపటిలా ఫీల్డ్‌లో అల్లరి పనులకు దూరంగా ఉన్నాడు.
కానీ దులీప్ ట్రోఫీతో తిరిగి మొదలుపెట్టాడు. 21 నెలల తర్వాత దులీప్ ట్రోఫీతో రెడ్ బాల్ క్రికెట్‌కు పంత్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా-బీ తరఫున బరిలోకి దిగిన బ్యాటుతో పాటు తన అల్లరితో ఆకట్టుకుంటున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో టీ20 ఇన్నింగ్స్ తరహా బ్యాటింగ్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టు ఇండియా-ఏ టీమ్ హడల్ నిర్వహించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జట్టుకు ఎలా ఆడాలో మార్గనిర్దేశం చేశాడు. అయితే ఆ టైమ్‌లో వాళ్లతో పంత్ చేరాడు.
ప్రత్యర్థి ఆటగాళ్లతో కలిసిపోయి గిల్ మాటలను పంత్ విన్నాడు. ఇక ఆటగాళ్లంతా తమ స్థానాలకు వెళ్లే సమయంలో పంత్ డగౌట్‌కు వెళ్లిపోయాడు. మా మీటింగ్‌లో నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్లుగా ఇండియా-ఏ జట్టు పేసర్ అవేశ్ ఖాన్ అడగ్గా.. పంత్ చిరునవ్వుతో అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే పంత్ చేసిన పనిపై మిశ్రమ స్పందన వస్తుంది.
పంత్ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుందని కొందరు పాజిటివ్‌గా కామెంట్లు చేయగా..మరికొందరు మండిపడుతున్నారు. చిన్నపాటి సిరీస్‌లా దులీప్ ట్రోఫీని పంత్ మార్చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి ప్రణాళిక సమయంలో ఓ ప్లేయర్ ఉండటం అంటే టోర్నమెంట్ తీవ్రతను తగ్గించడమే అని కామెంట్లు చేస్తున్నారు.
Look who was there in the India A huddle before the start of the day's play 😃 #DuleepTrophy| @IDFCFIRSTBank
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
Follow the match 🔽 https://t.co/Oke5l0BJpq pic.twitter.com/MxL8Pv05dV