For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy: పంత్ విధ్వంసం..టెస్టులో టీ20 ఇన్నింగ్స్ (Video)

దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున బరిలోకి దిగిన రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 21 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లో పునరాగమనం చేసిన పంత్ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో పంత్ ఫోర్, సిక్సర్ బాది, ఆ తర్వాత సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో నిలిచిన దశలో పంత్ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సర్ఫరాజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు 29 బంతుల్లోనే అర్ధశతకం భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.

Duleep Trophy 2024 Rishabh Pant Returns to First-Class Cricket After 21 Months with Blazing 34-Ball Fifty

ప్రస్తుతం ఇండియా-బీ జట్టు 140/5తో నిలిచింది. 230 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి ఉన్నారు. కాగా, ఇండియా-బీ మొదటి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. పంత్ 7 పరుగులే చేశాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37; 111 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు వికెట్లు తీశారు. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Saturday, September 7, 2024, 16:41 [IST]
Other articles published on Sep 7, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+