For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy: టైమింగ్స్ ఏంటి? ఫ్రీగా ఎలా చూడాలంటే?

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు మినహా మిగిలిన స్టార్ ఆటగాళ్లందరూ ఈ దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. ఈ సారి నాలుగు జట్లతో ఈ టోర్నీ జరగనుంది.

1961లో మొదలైన దులీప్‌ ట్రోఫీ గతంలో ఆరు జట్లతో జోనల్ ఫార్మాట్‌లో జరిగేది. కానీ ఈ ఎడిషన్‌ నుంచి జోనల్ ఫార్మాట్‌‌లో కాకుండా.. టీమ్ ఏ, టీమ్ బీ, టీమ్‌ సీ, టీమ్‌ డీ జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనుంది. దులీప్ ట్రోఫీలో సత్తాచాటిన ఆటగాళ్లను బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సత్తాచాటి టీమిండియాలో చోటు సంపాదించు యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.

Duleep Trophy 2024 Live Streaming Details Full Schedule Squads and Where to Watch

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి రౌండ్‌కు ఎంపిక చేసిన నాలుగు జట్ల వివరాలు, మ్యాచ్ షెడ్యూల్ పూర్తి వివరాలు

ఇండియా ఏ: శుభ‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్.

దులీప్ ట్రోఫీ షెడ్యూల్
సెప్టెంబరు 5 - టీమ్ ఏ Vs టీమ్ బీ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
సెప్టెంబరు 5 - టీమ్‌ సీ Vs టీమ్ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్ ఏ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్‌ బీ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్‌ బీ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్‌ ఏ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)

లైవ్ ఎలా చూడాలంటే?
స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో చూడాలంటే 'జియో సినిమా' వేదికగా చూడాలి. జియో సినిమాలో లైవ్ చూడటానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Story first published: Wednesday, September 4, 2024, 14:39 [IST]
Other articles published on Sep 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+