Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నితీశ్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్.. సంజు ఇన్- ఇషాన్‌ ఔట్: బీసీసీఐ

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఇవాళ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు మినహా మిగిలిన స్టార్ ఆటగాళ్లందరూ ఈ దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. ఈ సారి నాలుగు జట్లతో ఈ టోర్నీ జరగనుంది.

అయితే ఈ జట్ల గురించి బీసీసీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌కు దూరమవుతున్నారని తెలిపింది. మరోవైపు సంజు శాంసన్, నితీశ్ కుమార్ రెడ్డి ఈ టోర్నీ ఆడనున్నారని ప్రకటించింది. బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఇషాన్‌కు గజ్జల్లో గాయమవ్వగా, సూర్య కుడి బొటనివేలుకు గాయమైంది. ఈ క్రమంలో వారిద్దరు టోర్నీకి దూరమయ్యారని, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారని బీసీసీఐ పేర్కొంది.

Duleep Trophy 2024 Kishan Suryakumar Prasidh Out Nitish Reddy Cleared to Play

ఇండియా-డీ జట్టులో ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ ఎంపికయ్యాడు. సూర్య, ప్రసిధ్ కృష్ణ రిప్లేస్‌మెంట్ గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ టోర్నీలో ఆడటానికి నితీశ్ కుమార్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆది నుంచే ఇండియా బీలో నితీశ్ ఉన్నప్పటికీ.. ఈ టోర్నీలో పాల్గొనడం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో తెలిపింది. కాగా, నితీశ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది.

గాయాలు, ఇతరత్రా కారణాలతో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, రవీంద్ర జడేజా కూడా దులీప్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి రౌండ్‌కు ఎంపిక చేసిన నాలుగు జట్ల వివరాలు, మ్యాచ్ షెడ్యూల్ పూర్తి వివరాలు

ఇండియా ఏ: శుభ‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్.

దులీప్ ట్రోఫీ షెడ్యూల్
సెప్టెంబరు 5 - టీమ్ ఏ Vs టీమ్ బీ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
సెప్టెంబరు 5 - టీమ్‌ సీ Vs టీమ్ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్ ఏ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)
సెప్టెంబరు 12 - టీమ్‌ బీ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్‌ బీ Vs టీమ్‌ డీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'బీ', అనంతపురం)
సెప్టెంబరు 19 - టీమ్‌ ఏ Vs టీమ్‌ సీ (రూరల్ డెవలప్‌మెంట్ స్టేడియం 'ఏ', అనంతపురం)

Story first published: Thursday, September 5, 2024, 9:43 [IST]
Other articles published on Sep 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+