Duleep Trophy 2024: ఇషాన్ సంచలన ఇన్నింగ్స్.. ధనాధన్ సెంచరీ
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ శతకంతో చెలరేగాడు. అనంతపురం వేదికగా ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. 120 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో విజృంభిస్తున్నాడు.
గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌కు దూరమైన ఇషాన్ కిషన్ రెండో రౌండ్‌లో ఇండియా-సీ తరఫున బరిలోకి దిగాడు. కుదురుకున్న సహచరులు స్వల్పవ్యవధిలోనే వరుసగా వెనుదిరిగి.. ప్రత్యర్థి పైచేయి సాధిస్తున్న తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించినా నిలకడగా పరుగులు సాధించి మూడంకెల స్కోరు అందుకున్నాడు.

దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిషన్ మొదట ఇండియా-డీ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ బుచ్చిబాబు టోర్నమెంట్‌లో అతను గాయపడ్డాడని, ఇషాన్ స్థానంలో సంజు శాంసన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సెలక్ట్ అయిన ఆటగాళ్లు జట్లను వీడటంతో మంగళవారం అప్‌డేటెడ్ టీమ్స్ జాబితాను విడుదల చేసింది. దీనిలో ఇషాన్ కిషన్ పేరు లేదు. కానీ అతను సీ జట్టు తరఫున ఇవాళ బరిలోకి దిగాడు.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-సీకి ఆదిలోనే చుక్కెదురైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పరుగు కోసం ప్రయత్నిస్తూ రుతురాజ్ చీలమండలానికి గాయమైంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ (40; 67 బంతుల్లో, 8 ఫోర్లు) మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (43; 75 బంతుల్లో, 8 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
అయితే వీరిద్దరు అర్ధశతకాల చేరువవుతున్న క్రమంలో ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో వికెట్ తీసి దెబ్బకొట్టారు. దీంతో ఒక్క పరుగు వ్యవధిలోనే పటిదార్, సుదర్శన్ వెనుదిరిగారు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇంద్రజిత్ (62 నాటౌట్; 123 బంతుల్లో, 6 ఫోర్లు) స్కోరుబోర్డు ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా-సీ 64 ఓవర్లకు 272/2 స్కోరు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications