వికెట్ల వేట..సిక్సర్ల మోత: ఆల్‌రౌండర్‌గా మారిన గంభీర్ శిష్యుడు
దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యువ బౌలర్ హర్షిత్ రాణా రాణిస్తున్నాడు. తొలి రౌండ్‌లో ఇండియా-సీతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. 13 ఓవర్లలో అయిదు ఓవర్లు మెయిడిన్లు వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ సాధించనప్పటికీ చక్కని బంతులతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం అనంతపురం వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ హర్షిత్ రాణా చెలరేగుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో విజృంభించాడు. కాగా, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న హర్షిత్ బౌలర్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఆఖరి ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నా.. ఒత్తిడికి లోనుకాకుండా గొప్పగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించి అందరి దృష్టి ఆకర్షించాడు.

అంతేగాక ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్‌తో హర్షిత్ రాణా మరింత పాపులర్ అయ్యాడు. ఢిల్లీకి చెందిన హర్షిత్ సాధారణంగా మైదానంలో కాస్త దూకుడుగా ఉంటాడు. ఇక గత ఐపీఎల్ సీజన్‌లో అప్పటి కేకేఆర్ మెంటార్ గంభీర్ చేతిలో పడి.. అతను బాంబులా తయారయ్యాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు సెలక్టర్ల దృష్టిలో పడి శ్రీలంక వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు.
అయితే తాను బంతితోనే కాకుండా బ్యాటుతోనూ సత్తాచాటగలని దులీప్ ట్రోఫీలో 22 ఏళ్ల హర్షిత్ నిరూపిస్తున్నాడు. స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (డకౌట్), సంజు శాంసన్ (5) వంటి ఆటగాళ్లే ఇండియా-ఏ బౌలర్ల ముందు నిలవలేకపోయారు. కానీ హర్షిత్ 29 బంతుల్లో 31 పరుగులతో సత్తాచాటాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఇది గాలివాటం ప్రదర్శన అనుకుంటే పొరపాటే. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోనూ హర్షిత్ ఆకట్టుకున్నాడు.
సహచరులంతా వెనుదిరుగుతున్నా నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై 30 బంతుల్ని ఎదుర్కొని అజేయంగా 12 పరుగులు చేశాడు. ఒక ఫోర్, సిక్సర్ బాదాడు. వికెట్లు తీయడంతో పాటు సిక్సర్ల బాదే సామర్థ్యంతో క్రమంగా హర్షిత్ రాణా ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే హర్షిత్ టీమిండియాలో అన్నిఫార్మాట్లలో అరంగేట్రం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములాని (89) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా-డీ 183 పరుగులకే కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్ (92) గొప్పగా పోరాడాడు. డీ టీమ్‌లో రెండో అత్యధిక స్కోరు హర్షిత్ సాధించిన 31 పరుగులే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications