Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rain Stopped Ind vs Ire 1st T20: ఈ ఐర్లాండ్ వెదర్ ఉందే.. ఎప్పుడు ఎలా ఉంటదో ఎవడికీ తెలీదు.. నెటిజన్లు ఫైర్

match

ఐర్లాండ్‌లోని మలాహిడేలోని విలేజ్‌లో భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. వాన దెబ్బకొట్టింది. టాస్‌కు ముందు కాసేపు దులిపిన వాన.. టాస్ అనంతరం కూడా జోరందుకుంది. ఫలితంగా మ్యాచ్ ప్రారంభం అయ్యేలా కన్పించడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఉసురుమంటున్నారు. ఈ మ్యాచ్‌‌లో ప్రధాన అట్రాక్టివ్స్.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం. ఇక ఈ రెండింటినీ చూడ్డానికి వాన దేవుడికి మనసొప్పలేదెమో... సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు జోరందుకున్న వాన.. ఎంతకు ఆగడం లేదు. ఇక పిచ్‌లో కవర్లను కప్పి పిచ్ పాడవకుండా చూస్తున్నారు. ఇక వాన కాసేపట్లో తగ్గితే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయి.

ఇక తొలి మ్యాచ్‌లోనే టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా వెదర్ ముందే పసిగట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే బౌలింగ్ బాగుంటుందని మాకు అనిపిస్తోందని అతను పేర్కొన్నాడు. ఎందుకంటే డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఓవర్లు కుదించినా అందుకు తగ్గట్టు బ్యాటింగ్ చేసే వీలుంటుందని హార్దిక్ ప్లాన్. ఇకపోతే ఐర్లాండ్ వెదర్ పట్ల నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేని ఐర్లాండ్ వాతావరణంలో మ్యాచ్‌లు నిర్వహిస్తే గిట్లనే ఉంటది పరిస్థితి అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వర్షం ఒక మంచి మ్యాచ్‌ను బుగ్గిపాలు చేసేలా ఉందని మరికొందరు ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌కు తుది జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI) : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కోనర్ ఓల్ఫెర్ట్

Story first published: Sunday, June 26, 2022, 22:38 [IST]
Other articles published on Jun 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+