Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత స్క్వాడ్ నుంచి అతను ఔట్.. జట్టులోకి దీపక్ చాహర్, చివరి మ్యాచ్‌లో అతన్ని ఆడిస్తారా?

Due to Illness Avesh Khan Ruled Out Deepak Chahar in India squad

భారత ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ భారత ఆసియా కప్‌ స్క్వాడ్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ మంగళవారం ఈ విషయాన్ని నివేదించింది. అతని స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ అయిన దీపక్ చాహర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని మెరుగైన ప్రదర్శన తర్వాత అవేష్ ఖాన్‌ టీమిండియా తరఫున రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు.. రన్స్ భారీగా ఇస్తున్నప్పటికీ అవేశ్ ఖాన్ పట్ల భారత మేనేజ్ మెంట్‌ ఎనలేని నమ్మకాన్ని కనబర్చింది. అయితే అవేశ్ ఖాన్ హాంకాంగ్ మీద పేలవ బౌలింగ్ వేశాడు. అతను తన 4ఓవర్ల కోటాలో ఏకంగా 53పరుగులిచ్చుకున్నాడు. ఇక అతను జ్వరం బారిన పడి సూపర్ 4 దశలో పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఇకపోతే దీపక్ చాహర్ వెన్ను గాయంతో ఈ ఏడాది చాలా క్రికెట్ టోర్నీలకు మిస్సయ్యాడు. ఐపీఎల్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు తిరిగి వచ్చి.. తన గోల్డెన్ టచ్ చూపించాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇక పునరాగమనంలో ఆకట్టుకున్న దీపక్ చాహర్.. ఆసియా కప్ టోర్నీకి మాత్రం స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. ఫలితంగా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక అవేశ్ ఖాన్ అనారోగ్యంతో దూరం కాగా.. దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు. సెప్టెంబర్ 6న ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే సూపర్ 4 మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేస్తారో లేదో చూడాలి.

భువనేశ్వర్ కుమార్‌ లాగే దీపక్ చాహర్ మంచి స్వింగ్ బౌలర్. అయితే భువీ పవర్ ప్లే బౌలర్‌గా రాణిస్తున్నా.. డెత్ ఓవర్లలో మాత్రం తేలిపోతున్నాడు. సూపర్ 4లో పాకిస్థాన్‌పై 19ఓవర్లలో 19పరుగులు, నిన్న శ్రీలంకపై 19వ ఓవర్లో 14పరుగులిచ్చి భారత విజయాన్ని దూరం చేసే ప్రదర్శన కనబర్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో భువీని బాగా ఉపయోగించుకోవాలి. ఇక దీపక్ చాహర్‌కు సీఎస్కేకు ఆడిన అనుభవం ఉంది. అందువల్ల అతను జట్టులో ఉంటే.. జట్టుకు కాస్త ఉపయుక్తంగా ఉంటుంది. ఇక గాయపడక ముందు దీపక్ చాహర్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే వైట్-బాల్ గేమ్‌లలో భారతదేశానికి అవసరమైన లోయర్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌గా మారాడు. ఇకపోతే ఆసియాకప్ జట్టు ఎంపికలో టీమిండియా మేనేజ్ మెంట్ గందరగోళానికి గువుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

Story first published: Wednesday, September 7, 2022, 8:57 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+