స్టోక్స్ నిర్ణయంతో నసీర్ హుస్సేన్ దిగ్భ్రాంతి.. ఇంగ్లాండ్ క్రికెట్ సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపాటు

వన్డే క్రికెట్‌కు బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, అదే సమయంలో తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ అన్నాడు. 31ఏళ్ల స్టోక్స్.. సోమవారం అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్ తొలి వన్డేలో అతను చివరిసారిగా ఆడబోతున్నాడు. ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల జో రూట్ నుంచి టెస్ట్ కెప్టెన్‌గా స్టోక్స్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్టోక్స్ ఆడిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇక తాను వన్డే క్రికెట్‌లో తన 100శాతం ప్రదర్శన జట్టుకు అందించలేకపోతున్నానని, బిజీ షెడ్యూళ్ల మధ్య మూడు ఫార్మాట్లలో తాను ఇమడలేకపోతున్నానని స్టోక్స్ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్టుగా..
ద్వైపాక్షిక (ఇరు దేశాల మధ్య) వన్డే క్రికెట్ ఆవశ్యకతపై ఇటీవల ప్రశ్నలు రేకెత్తుతున్న తరుణంలో స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ విస్తుగొలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్లలో ఇంగ్లాండ్ ఒకటి. ఇక 2023 నుంచి 2027 మధ్య ఇంగ్లాండ్ ద్వైపాక్షికంగా 44 వన్డేలు ఆడనుంది. ఇక మొత్తంగా అన్ని ఫార్మాట్లతో కలిపి 138ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్టోక్స్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. స్టోక్స్ ఆ మధ్య గాయాలతో సతమతమయ్యాడు. అతను గత సంవత్సరం మెంటల్ హెల్త్ బ్రేక్ కూడా తీసుకున్నాడు. గత సంవత్సరం UAEలో జరిగిన ఐపీఎల్ 2022 నుంచి, టీ20 ప్రపంచకప్‌ల నుంచి కూడా అతను స్వతహాగా తప్పుకున్నాడు.

ఏదో ఆడామా లేదా అనే క్యారక్టర్ కాదు స్టోక్స్‌ది
ఇక స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయం గురించి నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ..'ఇది నిరాశపరిచే వార్తే. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పడానికి స్టోక్స్ నిర్ణయం ఓ ఉదాహరణ. ఇది ఆటగాళ్లకు పిచ్చిలేపుతుంది. స్టోక్స్ రిటైర్మెంట్‌కు కారణాల్లో సగం శారీరకమైనవైతే.. మానసికమైనవి మరో సగం. బెన్ స్టోక్స్ ఎప్పుడూ గ్రౌండ్లో 70శాతం, 80శాతం ప్రదర్శన ఇచ్చే ప్లేయర్ కాడు. అతను కేవలం బిట్-పార్ట్ ప్లేయర్‌గా ఉండడు. అతను కచ్చితంగా తన నుంచి 100శాతం ప్రదర్శన రావాలని తహతహలాడే ప్లేయర్. 100శాతం ఇవ్వకుంటే అతను తప్పకుండా నిరాశచెందుతాడు' నసీర్ తెలిపాడు.

బెన్ స్టోక్స్ లాంటి ప్లేయరే తట్టుకోలేకపోయాడు
'స్టోక్స్ నిర్ణయానికి గల కారణాల్లో బిజీ షెడ్యూల్ కూడా కీలకమైందని భావిస్తున్నా. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ పూర్తిగా క్రేజీగా ఉంది. కేవలం ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడగలితే సపోజ్ టెస్ట్ మ్యాచ్‌లు అయితే దానికే స్టిక్ కావాలి. ఇది కచ్చితంగా మంచిది. కానీ మీరు మల్టీ ఫార్మాట్, మల్టీ డైమెన్షనల్ ప్లేయర్ అయితే.. ప్రస్తుత షెడ్యూల్లో మీరు రాణించడం కష్టం. బెన్ స్టోక్స్ లాంటి గొప్ప ప్లేయర్ విషయంలో కూడా ఇది జరిగింది. గ్రౌండ్లో 100శాతం ప్రదర్శన కనబర్చే స్టోక్స్ లాంటి ప్లేయరే.. చివరికి ఇలా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. నిజంగా ఇంగ్లాండ్ క్రికెట్‌కు ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన టైం అని చెప్పుకోవాలి. ఈ విషయమై ఆలోచించాలి. ఎన్నాళ్లో వేచిన ఇంగ్లాండ్ చిరకాల కలను స్టోక్స్ 2019లో తీర్చాడు. ఇంగ్లాండ్ అభిమానులకు మరిచిపోలేని గొప్ప రోజు ఇచ్చాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్‌ను మనం ఎప్పటికీ మర్చిపోలేం' అని నసీర్ హుసేన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications